Video: 47 బంతుల్లోనే 104 పరుగులు.. పీటర్సన్ సవాల్‌కు ఇచ్చిపడేసిన టీమిండియా యంగ్ గన్..
Yashasvi Jaiswal Smashes 47-Ball Century: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి తన బ్యాటింగ్ పవర్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన యూట్యూబ్ ఛానెల్ 'ద స్విచ్' కోసం విసిరిన కఠినమైన సవాల్‌లో జైస్వాల్ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.

Yashasvi Jaiswal Smashes 47-Ball Century: టీమిండియా యువ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తూనే, మరోవైపు విభిన్నమైన ఛాలెంజ్‌లలో కూడా తన సత్తా చాటుతున్నారు. ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించే ‘ద స్విచ్’ (The Switch) అనే కార్యక్రమంలో పాల్గొన్న జైస్వాల్, ఒక అద్భుతమైన ఫీట్ సాధించారు.
ఏమిటా ఛాలెంజ్? కెవిన్ పీటర్సన్ ఈ ఛాలెంజ్‌ను చాలా కఠినంగా రూపొందించారు. దీని నిబంధనల ప్రకారం:
బౌలింగ్ మెషిన్ ఎదుట 50 బంతుల్లో 100 పరుగులు చేయాలి.
ప్రతి బంతికి వేగం 1 mph (మైలు) చొప్పున పెరుగుతూ ఉంటుంది.
ఒకవేళ బ్యాటర్ అవుట్ అయితే, మొత్తం స్కోరు నుంచి 5 పరుగులు కట్ చేస్తారు.
47 బంతుల్లోనే 104 పరుగులు..!
ఈ ఛాలెంజ్‌లో జైస్వాల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. 51 మైళ్ల వేగంతో మొదలైన బంతులు చివరకు 156 కిలోమీటర్ల (సుమారు 97 మైళ్ల) వేగాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలో జైస్వాల్ రెండు సార్లు అవుట్ అవ్వడంతో 10 పరుగులు మైనస్ అయ్యాయి. అయినప్పటికీ, ఏమాత్రం తడబడకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. చివరకు 47వ బంతికి భారీ సిక్సర్ బాది తన సెంచరీని పూర్తి చేశారు. మొత్తం 47 బంతుల్లో 104 పరుగులు (మైనస్ పాయింట్లు పోగా) చేసి పీటర్సన్‌ను షాక్‌కు గురిచేశారు.
పీటర్సన్ ప్రశంసల వర్షం..
జైస్వాల్ బ్యాటింగ్ చూసి ముగ్ధుడైన కెవిన్ పీటర్సన్, అతని ‘హ్యాండ్-ఐ కోఆర్డినేషన్’ అద్భుతమని కొనియాడారు. “జైస్వాల్ ఆటలో నాకు ఎలాంటి లోపాలు కనిపించడం లేదు. అతను భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు” అని పీటర్సన్ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ 2026 పై గురి..
టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో చోటు దక్కలేదనే నిరాశలో ఉన్న అభిమానులకు జైస్వాల్ ఈ ఇన్నింగ్స్ ద్వారా ఒక బలమైన సంకేతాన్ని పంపారు. తనలో పవర్ ఏమాత్రం తగ్గలేదని, రాబోయే ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున పరుగుల వరద పారించడానికి తాను సిద్ధంగా ఉన్నానని నిరూపించుకున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




