పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో కాంస్యం గెలిచిన సింఘరాజ్ అధనా.. 8కి చేరిన పతకాల సంఖ్య
Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్ క్రీడలలో ఈరోజు ఏడవ రోజు. అంతకుముందు రోజు, భారతదేశం 2 స్వర్ణాలతో సహా 5 పతకాలు గెలుచుకుంది.
Tokyo Paralympics: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్లో భారతదేశం ఖాతాలో మరో పతకం చేరింది. ఫైనల్లో తలపడిన సింఘరాజ్ అధనా కాంస్యం పతకం సాధించాడు. ఈ రోజు కూడా టోక్యోలో భారత ప్లేయర్లు బాగా రాణించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్స్‌లో మనీష్ నర్వాల్, సింఘరాజ్ అధనా అర్హత సాధించారు. మనీష్ 575-21x స్కోర్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అదే సమయంలో, సింఘ్రాజ్ 569-18x స్కోరుతో ఆరో స్థానంలో నిలిచాడు. దీపేందర్ సింగ్ 10 వ స్థానంలో నిలిచి ఫైనల్లో చోటు కోల్పోయాడు.
అనంతరం జరిగిన ఫైనల్ పోరులో పారా షూటర్ సింఘరాజ్ 2020 టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 లో కాంస్య పతకం సాధించాడు. షూటర్ చావో యాంగ్ రజతం గెలచుకోగా, జింగ్ హువాంగ్ బంగారు పతకం గెలచుకున్నాడు. మూడో స్థానంలో నిలిచిన సింఘరాజ్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు భారత్ టోక్యోపారాలింపిక్స్‌లో 8 పతకాలు గెలుచుకుంది.
అంతకుముందు, జావెలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్ సోమవారం జరిగిన జావెలిన్ ఎఫ్ -64 ఈవెంట్‌లో మూడుసార్లు తన ప్రపంచ రికార్డును అధిగమించి బంగారు పతకాన్ని సాధించాడు. పారా-రైఫిల్ షూటర్ అవని లేఖరా ఆర్2 మహిళల 10 మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 కేటగిరీలో టాప్ ప్లేస్ సాధించిన తర్వాత ఇది దేశానికి రెండవ బంగారు పతకం. మొత్తంమీద ఐదవది.
Shooting P1 – Men’s 10m Air Pistol SH1 FINAL: MEDAL CONFIRMED for #IND SINGHRAJ
— Doordarshan Sports (@ddsportschannel) August 31, 2021
Also Read: