Tokyo Paralympics:10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ చేరిన మనీష్ నర్వాల్, సింఘరాజ్ అధనా.. నిరాశపరిచిన రుబినా..!
Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్ క్రీడలలో ఈరోజు ఏడవ రోజు. అంతకుముందు రోజు, భారతదేశం 2 స్వర్ణాలతో సహా 5 పతకాలు గెలుచుకుంది.
Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్ క్రీడలలో ఈరోజు ఏడవ రోజు. అంతకుముందు రోజు, భారతదేశం 2 స్వర్ణాలతో సహా 5 పతకాలు గెలుచుకుంది. ఈ రోజు కూడా టోక్యోల భారత ప్లేయర్లు బాగా రాణించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్స్‌లో మనీష్ నర్వాల్, సింఘరాజ్ అధనా అర్హత సాధించారు. మనీష్ 575-21x స్కోర్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అదే సమయంలో, సింఘ్రాజ్ 569-18x స్కోరుతో ఆరో స్థానంలో నిలిచాడు. దీపేందర్ సింగ్ 10 వ స్థానంలో నిలిచి ఫైనల్లో చోటు కోల్పోయాడు. ఫైనల్లో రుబినా ఫ్రాన్సిస్ నిరాశపరిచింది. రుబినా క్వాలిఫికేషన్ రౌండ్‌లో అద్భుతంగా ఆడి, పీ 2 మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. ఇందులో 560 పాయింట్లతో 7 వ స్థానంలో నిలిచింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో రుబినా బాగా రాణిస్తుందని అంతా భావించారు. కానీ, ఫైనల్‌లో ఆమె నిరాశపరిచింది. ఫైనల్స్‌లో తొలి ఎలిమినేషన్ రౌండ్‌లో, రూబీనా 110.5 స్కోరుతో ఆరో స్థానంలో నిలిచింది. దీని తరువాత, రెండవ రౌండ్‌లో 128.5 స్కోర్‌తో ఏడవ స్థానంలో నిలిచి ఫైనల్స్ చేరుకోలేకపోయింది.
క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన రాకేశ్ కుమార్, సిమ్రాన్… రాకేశ్ కుమార్.. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ 1/8 ఎలిమినేషన్‌లో 140-137 తేడాతో మరియాన్ మారెక్‌పై గెలిచాడు. దీంతో రాకేష్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. కానీ, క్వార్టర్‌ఫైనల్స్‌లో అతను చైనాకు చెందిన ఐ జిన్‌లియాంగ్ 143-145తో ఓడిపోయాడు. మహిళల 100 మీటర్ల టీ -13 రేసులో సిమ్రాన్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఐదవ స్థానంతో నిలిచి, ఆమె ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ దూరాన్ని కేవలం 12.69 సెకన్లలో పూర్తి చేసింది.
మహిళల డబుల్స్‌లో భవినా, సోనాల్ జంట.. టోక్యో పారాలింపిక్ టేబుల్ టెన్నిస్ క్లాస్ 4 ఈవెంట్లలో భారత్ ప్లేయర్లు పేలవమైన ప్రదర్శన చేశారు. భావినా పటేల్, సోనాల్‌బెన్ పటేల్ జంటను చైనాకు చెందిన జూయింగ్, జాంగ్ బియాన్ వరుస సెట్లలో ఓడించారు. చైనా జంట 11-2, 11-4, 11-2తో భారత జట్టును ఓడించింది.
టోక్యోలో సోమవారం చరిత్ర సృష్టించిన భారతదేశం.. మొత్తం 5 పతకాలు గెలుచుకుంది. ఇంతకుముందు పారాలింపిక్స్‌లో గెలిచిన దానికంటే ఎక్కువ కావడం విశేషం. టోక్యో పారాలింపిక్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ 7 పతకాలు సాధించింది. ఇది భారతదేశానికి అత్యంత విజయవంతమైన పారాలింపిక్స్‌గా నిలిచింది. పతకాల జాబితాలో భారత్ 26 వ స్థానంలో ఉంది. అంతకుముందు, 2016 రియో ఒలింపిక్స్, 1984 ఒలింపిక్స్‌లో భారత్ 4 పతకాలు సాధించింది.
Also Read:
‘ముందుండి నడిపించడం కాదు.. మిగతా వారి నుంచి అత్యుత్తమ ఆటను రాబట్టండి’: కోహ్లీకి మాజీ కోచ్ సూచన
జట్టు నుంచి తొలగించిన వ్యక్తి ఇప్పుడు విరాట్ కోహ్లీకి బాస్ అయ్యాడు..! అతడు ఎవరో తెలుసా..?