‘ముందుండి నడిపించడం కాదు.. మిగతా వారి నుంచి అత్యుత్తమ ఆటను రాబట్టండి’: కోహ్లీకి మాజీ కోచ్ సూచన

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఐదు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీ సాయంతో 124 పరుగులు మాత్రమే చేశాడు. గత 50 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయలేకపోయాడు.

'ముందుండి నడిపించడం కాదు.. మిగతా వారి నుంచి అత్యుత్తమ ఆటను రాబట్టండి': కోహ్లీకి మాజీ కోచ్ సూచన
Virat Kohli Test Cricket
Follow us

|

Updated on: Aug 31, 2021 | 9:04 AM

Virat Kohli: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరీస్‌లోని మూడో టెస్టులో మాత్రం తన తొలి అర్థ సెంచరీ పూర్తి చేసి ఫాంలోకి వచ్చినట్లే అనిపించాడు. కానీ, ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. అయితే ఈ సందర్భంగా మాజీ వ్యాఖ్యాత డబ్ల్యూ రామన్ మాట్లాడుతూ, కోహ్లీకి పలు సూచనలు చేశాడు. మిగతా ఆటగాళ్లను చూసి నేర్చుకోవాలని, త్వరగా ఒత్తిడి నుంచి బయటపడాలని సూచించాడు. అలాగే ఇతరుల ముందునుంచి నడిపించే బదులు.. వారి నుంచి అత్యుత్తమ ఆటతీరును పొందేందుకు ప్రయత్నించాలని కోరాడు.

‘విరాట్ కోహ్లీ, ముందు నుంచి టీంను నడిపించే బదులు.. వారి నుంచి అత్యుత్తమ ఆటను పొందేందుకు వారికి అండగా ఉండాలని’ కోహ్లీకి చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ ఏ సమయంలోనైనా కోహ్లీ తిరిగి తన పాత ఫాంకు చేరుకుంటాడని తెలుసు. ఈ లోపు ప్రస్తుత ఫాం గురించి ఆలోచించకుండా ఇతర ఆటగాళ్లను అత్యుత్తంగా తీర్చిదిద్దాలని కోరాడు. తర్వాతి రెండు టెస్టుల్లో అతను బాగా రాణిస్తాడని నేను అనుకుంటున్నాను. ప్రస్తుత ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో, కోహ్లీ హాఫ్ సెంచరీ సాయంతో ఐదు ఇన్నింగ్స్‌లలో 124 పరుగులు మాత్రమే చేశాడు. గత 50 ఇన్నింగ్స్‌లలో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయలేకపోయాడు.

ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా కోహ్లీ లాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొన్నాడు అని రామన్ అన్నారు. ‘ఇలాంటి పరిస్థితిపై కోహ్లీని తప్పుపట్టలేం. కెరీర్‌లో ఇలాంటి దశలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ప్రస్తుతం విరాట్ మీద చాలా ఒత్తిడి ఉంది. అతను అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని మనకు తెలుసు. అతనిపై చాలా ఆశలున్నాయి. ఇవి సచిన్ టెండూల్కర్‌తో సమానంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సచిన్ 95 స్కోర్ చేయడం, ఆటైంలో ఔట్ అవ్వడం కూడా వైఫల్యంగా పరిగణించారు. మరోవైపు భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా గడ్డు దశలో ఉన్నాడు. రహానేకి కూడా చాలా అనుభవం ఉందని, అయితే విజయం సాధించాలంటే మాత్రం తన బ్యాటింగ్‌లో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది’ అని అన్నారు.

మరో ఆటగాడు రాహుల్ నాటింగ్‌హామ్‌లో ఆడిన ఇన్నింగ్స్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అతను చాలా బాగా ఆడాడు. బంతి పిచ్‌కు కొడుతూ పరుగులు సాధించడంలో సఫలం అయ్యాడు. అదే సమయంలో బంతిని చివరి వరకు చూసి ఆతర్వాత వదిలివేశాడు. ఇది చాలా మంచి బ్యాటింగ్. ఇది డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో ఆత్మ విశ్వాసం నింపేలా ఉంది. ప్రతీ బ్యాట్స్‌మెన్ కచ్చితమైన విధానంపై బ్యాటింగ్ చేయాలి. అప్పుడే ఇలాంటి గడ్డు పరిస్థితిని అధిగమించడానికి సహాయపడుతుంది. రహానే అనుభవజ్ఞుడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. విదేశాలలో కూడా భారీగానే పరుగులు సాధించాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళా క్రికెట్ జట్టు అవకాశాల గురించి అడిగినప్పుడు, రామన్ ఇలా అన్నాడు.. “ఆసీస్ లేదా ఇంగ్లీష్ మహిళా టీంలకు సమాలు చేయగల సత్తా ఉన్న జట్లలో టీమిండియా అమ్మాయిలు ముందుంటారు. మరే ఇతర జట్టు కూడా టీమిండియా మహిళా జట్టులా ఆడలేదు” అని వెల్లడించాడు.

మహిళా జట్టు మాజీ కోచ్‌గా ఉన్న రమణ్ మాట్లాడుతూ, ‘టీమిండియా మహిళలు ఇంతకు ముందు డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదని, పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఉమెన్స్‌కు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు.

Also Read:

జట్టు నుంచి తొలగించిన వ్యక్తి ఇప్పుడు విరాట్ కోహ్లీకి బాస్‌ అయ్యాడు..! అతడు ఎవరో తెలుసా..?

Vasoo Paranjape: సచిన్ టెండూల్కర్‌, రోహిత్ శర్మల కోచ్ మృతి.. సంతాపం తెలిపిన పలువురు ఆటగాళ్లు..