జట్టు నుంచి తొలగించిన వ్యక్తి ఇప్పుడు విరాట్ కోహ్లీకి బాస్‌ అయ్యాడు..! అతడు ఎవరో తెలుసా..?

Cricket News: ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా లార్డ్స్ టెస్ట్‌లో గెలిచి ఊపుమీదుంది. నాటింగ్‌హామ్ టెస్ట్ డ్రా అయిన తర్వాత

జట్టు నుంచి తొలగించిన వ్యక్తి ఇప్పుడు విరాట్ కోహ్లీకి బాస్‌ అయ్యాడు..! అతడు ఎవరో తెలుసా..?
Virat Kohli
Follow us
uppula Raju

|

Updated on: Sep 02, 2021 | 5:07 PM

Cricket News: ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా లార్డ్స్ టెస్ట్‌లో గెలిచి ఊపుమీదుంది. నాటింగ్‌హామ్ టెస్ట్ డ్రా అయిన తర్వాత లార్డ్స్ టెస్టులో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డ్‌లు సాధించినప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం నిరాశగానే ఉన్నాడు. ఎందుకంటే అతను ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించలేకపోయాడు. అయితే పేలవ ప్రదర్శన కారణంగా జట్టు నుంచి తొలగించబడిన వ్యక్తి ఇప్పుడు అతడికి బాస్‌గా ఉన్నాడు.

వాస్తవానికి ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కాటిచ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆగస్టు 21, 1975 న ఇతడు జన్మించాడు. కాటిచ్‌కు శ్రీలంకపై అరంగేట్రం చేసే అవకాశం లభించింది కానీ అనారోగ్యం వల్ల అది కుదరలేదు. తర్వాత 2000-01 సంవత్సరంలో అతను యాషెస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌ నాలుగో టెస్టులో గాయపడిన స్టీవ్ వా స్థానంలో మైదానంలో అడుగుపెట్టాడు. కానీ కేవలం15 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత జట్టులో స్థానం కోసం రెండు సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. ఇంతలో జింబాబ్వేపై మళ్లీ ఓ అవకాశం వచ్చింది. సిడ్నీలో జరిగిన ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను బంతితో అద్భుతంగా రాణించాడు. 65 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. మరుసటి సంవత్సరం సిడ్నీలో మళ్లీ మ్యాచ్ ఆడాడు ఈసారి భారతదేశంపై తన మొదటి టెస్ట్ సెంచరీని సాధించాడు.

2010-11 సంవత్సరంలో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడం కూడా అతనిపై ప్రభావం పడింది. అతడిని జట్టు నుంచి తొలగించారు. క్రికెట్ ఆస్ట్రేలియా తదుపరి సీజన్ కోసం ఒప్పందాన్ని కూడా పునరుద్ధరించలేదు. కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ సైమన్ కాటిచ్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పెద్ద బాధ్యత అప్పగించారు. 2019 సంవత్సరంలో అతను విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రధాన కోచ్‌గా నియమించారు. అతను ఇప్పటికీ ఈ స్థితిలోనే కొనసాగుతున్నడు. ఆస్ట్రేలియా తరఫున కాటిచ్ 56 టెస్టుల్లో 10 సెంచరీలు, 45.03 సగటుతో 4188 పరుగులు చేశాడు. అదే సమయంలో 45 వన్డేల్లో అతను 35.78 సగటుతో 1324 పరుగులు చేశాడు. మూడు టీ 20 ల్లో 34.50 సగటుతో 69 పరుగులు చేశాడు.

టైటానిక్ హీరో ఆప్గాన్‌లో అగ్గి రాజేశాడు.. ఆ నిప్పు మళ్లీ ఇప్పుడు రాజుకుంటుంది.. ఏం చేశాడంటే..

Hurricane Ida: ఎటు చూసినా జల బీభత్సమే.. ప్రచండ గాలులు.. ఎగిరిపడుతున్న ఇళ్ల పైకప్పులు.. జలదిగ్భందంలో అమెరికా..

Vasoo Paranjape: సచిన్ టెండూల్కర్‌, రోహిత్ శర్మల కోచ్ మృతి.. సంతాపం తెలిపిన పలువురు ఆటగాళ్లు..

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..