టైటానిక్ హీరో ఆప్గాన్‌లో అగ్గి రాజేశాడు.. ఆ నిప్పు మళ్లీ ఇప్పుడు రాజుకుంటుంది.. ఏం చేశాడంటే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Aug 30, 2021 | 8:42 PM

ఆఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లను చూసి ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. మునుపటి దమనకాండను తలుచుకుంటూ.. దేశం

టైటానిక్ హీరో ఆప్గాన్‌లో అగ్గి రాజేశాడు.. ఆ నిప్పు మళ్లీ ఇప్పుడు రాజుకుంటుంది.. ఏం చేశాడంటే..
Taitanik

ఆఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లను చూసి ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. మునుపటి దమనకాండను తలుచుకుంటూ.. దేశం వదిలి వెళ్లేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆ దేశ సెలూన్‌ ఓనర్లు తాలిబన్లను చూసి తెగ వణికిపోతున్నారు. టైటానిక్‌ హీరో లియోనార్డో డికాప్రియో కారణంగా.. తమకు ఎక్కడ శిక్షిస్తారో అని టెన్షన్‌ పడుతున్నారు. అసలు టైటానిక్ హీరోకి… తాలిబన్లకు సంబంధం ఏంటాని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..

సరిగ్గా 20 ఏళ్ల ముందు… అంటే 1996 నుంచి 2001 వ‌ర‌కు! ఆ టైంలో తాలిబ‌న్లు ఆఫ్గాన్‌లో రాజ్య‌మేలిన సంగ‌తి తెలుసు క‌దా. అదే స‌మ‌యంలో హాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ మూవీ టైటానిక్ వ‌చ్చింది. ఆ మూవీ హీరో లియోనార్డో డికాప్రియో హెయిర్‌క‌ట్ అప్ప‌ట్లో తెగ పాపుల‌ర్ అయింది. దీనిని బీటిల్స్ క‌ట్ అనేవాళ్లు. అత‌న్ని చూసి ఆఫ్ఘ‌న్‌లోని యువ‌త కూడా అలా హెయిర్ క‌ట్ చేయాలంటూ అక్క‌డి సెలూన్ల‌కు క్యూ క‌ట్టారు. అయితే క‌ఠిన‌మైన ఇస్లామిక్ చ‌ట్టాల‌ను అమ‌లు చేసే తాలిబ‌న్లు ఇలాంటి పాశ్చాత్య హెయిర్‌స్టైల్స్‌ను అంగీక‌రించ‌బోమ‌ని తేల్చి చెప్పారు. తేల్చిచెప్పడమే కాదు అలాంటి హెయిర్‌క‌ట్‌తో క‌నిపించిన యూత్‌ను ప‌ట్టుకెళ్లి మరీ గుండు చేయించేవారు. గుండుచేయించినా.. గట్టిగా చెప్పినా యూత్‌ వినకపోవడంతో.. ఇలాంటి హెయిర్‌క‌ట్ చేసే సెలూన్‌ ఓనర్లపై పడ్డారు తాలిబ‌న్లు. టైటానిక్‌ హీరో హెయిర్‌ స్టైల్ చేస్తున్న వారందరికీ శిక్షలు విధించారు. ఇక ఇప్పుడు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఆ తాలిబ‌న్ల పాల‌న మ‌ళ్లీ రావ‌డంతో ఇక త‌మ షాపులు మూత‌ప‌డిన‌ట్లేనని అక్క‌డి బార్బర్లు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌ని లేకుండా పోయింది. ఇస్లామిక్ చ‌ట్టాల ప్రకారం మా ప‌నేమో చట్ట విరుద్దం. పురుషులు మేక‌ప్‌, టాటూ వేసుకోవ‌డం నిషేధం. అమ్మాయిలు బయటికి రావడమే నేరం. ఇలాంటి ఆంక్షల నేపథ్యంలో ఇక మా బతుకులు సాగినట్టే…! అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో షాపులకు తాలాలు వేసి ఇంటికే పరిమితం అవుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Also Read: Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‏తో భారీ డీల్ చేసుకున్న శ్రుతిహాసన్.. పెద్ద సాహసమే చేస్తోందిగా..

Nikhil Siddhartha: మరోసారి ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో నిఖిల్.. అవేశాన్ని.. ఆక్రోశాన్ని అణిచివేయకుండా అంటూ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu