Nikhil Siddhartha: మరోసారి ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో నిఖిల్.. అవేశాన్ని.. ఆక్రోశాన్ని అణిచివేయకుండా అంటూ..

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఉన్న యువ నటులలో నిఖిల్ ఒకరు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నిఖిల్.

Nikhil Siddhartha: మరోసారి ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో నిఖిల్.. అవేశాన్ని.. ఆక్రోశాన్ని అణిచివేయకుండా అంటూ..
Nikhil
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 30, 2021 | 8:03 PM

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఉన్న యువ నటులలో నిఖిల్ ఒకరు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నిఖిల్.. మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ సరికొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. అలా కార్తీకే, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. అటు సినిమాలు చేస్తూనే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటాడు నిఖిల్. అటు రాజకీయ అంశాలపై.. సమాజంలో జరుగుతున్న విషయాలపై స్పందిస్తూ.. ట్వీట్స్ చేస్తుంటారు. అలాగే కరోనా లాక్‏డౌన్ సమయంలో నిఖిల్ ఎందరికో సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. అంతేకాదు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‏ను ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని వారికి సాయం చేశారు. ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 18 పేజెస్ సినిమాతోపాటు.. కార్తీకేయ 2 సినిమా చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 18 పేజెస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. సామాజిక అంశాలపై… రాజకీయ సమీకరణాలపై.. ఇండస్ట్రీలో జరిగే సంఘటనలపై.. మనసును కదిలించే అంశాలపై.. సూటిగా సుత్తిలేకుండా.. గాడంగా గంభీరంగా ట్వీట్లు చేస్తుంటారు హీరో నిఖిల్. అయితే తాజాగా అలాంటి ఓ ట్వీట్‌తోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు ఈ క్రేజీ హీరో. “మన చుట్టూ ఉన్న ప్రపంచం పర్‌ఫెక్ట్‏గా లేదు… యుద్ధాలు, రోగాలు, రొస్టులు, అశాంతి పరిస్థితులు.. అన్యాయాలు… అక్రమాలు.. ఇలాంటి వాటిని చూసినప్పుడు.. మనలో జనించిన ఆవేశాన్ని.. ఆక్రోశాన్ని… ఆవేదనను… అణిచివేయకుండా.. జిమ్‌లో ఖర్చు పెట్టండి… వర్కవుట్స్‌ చేయండి… పాజిటివిటితో మైండ్‌ని ఫిల్ చేయండి” అంటూ నిఖిల్ జిమ్ చేస్తున్న వీడియోతో పాటు తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

ట్వీట్..

Also Read: Shruti Haasan: అమెజాన్ ప్రైమ్‏తో భారీ డీల్ చేసుకున్న శ్రుతిహాసన్.. పెద్ద సాహసమే చేస్తోందిగా..

Jacqueline Fernandez: బాలీవుడ్ సెలబ్రెటీలకు బిగుస్తున్న మనీలాండరింగ్ కేసు.. స్టార్ హీరోయిన్‏కు చెమటలు పట్టించిన ఈడీ..

Lakshya Movie: షూటింగ్ పూర్తిచేసిన లక్ష్య.. త్వరలోనే థియేటర్లలో కలుద్దామంటూ యంగ్ హీరో ట్వీట్..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్