IND vs ENG: సిరీస్ తర్వాత ఆ స్టార్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? ఇప్పటికే వన్డే, టీ20లకు గుడ్‌బై

తన టెస్ట్ కెరీర్‌ను పొడిగించుకోవడానికి 2015 లో వన్డే, టీ 20 క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ఇటీవలి కాలంలో గాయాల బారిన నుంచి కోలుకున్నాక.. టెస్ట్ క్రికెట్‌ను జాగ్రత్తగా ఆడుతూ కెరీర్‌ను నెట్టుకొస్తున్నాడు.

IND vs ENG: సిరీస్ తర్వాత ఆ స్టార్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? ఇప్పటికే వన్డే, టీ20లకు గుడ్‌బై
Anderson England Leeds Test
Follow us
Venkata Chari

|

Updated on: Aug 31, 2021 | 11:11 AM

IND vs ENG: ఇంగ్లండ్, భారత్ టీంల మధ్య టెస్ట్ సిరీస్‌ జరుగుతోంది. ఇప్పటికే సిరీస్‌లో మూడు మ్యాచులు పూర్తయ్యాయి. చెరో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ సిరీస్‌ తరువాత ఓ స్టార్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ పేర్కొన్నాడు. ఆయనేమన్నాడంటే.. ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ త్వరలో రిటైర్ అయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ తర్వాత అతను తన రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. జేమ్స్ ఆండర్సన్ వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు. అతను టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటివరకు 600 కంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత అండర్సన్ మూడవ స్థానంలో నిలిచాడు. స్వదేశంలో ఆడిన టెస్టుల్లో 300 కంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. అతనితో పాటు, స్టువర్ట్ బ్రాడ్ కూడా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

భారత్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో, జేమ్స్ ఆండర్సన్ మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీశాడు. ఈ సమయంలో, అతని సగటు 16.25, స్ట్రైక్‌రేట్ 47.7తో వికెట్లు పడగొట్టాడు. స్టీవ్ హార్మిసన్ టాక్ స్పోర్ట్స్ క్రికెట్ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.., ‘ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు.. కానీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ తర్వాత జేమ్స్ ఆండర్సన్ రిటైర్ అవుతారని నేను నిజంగా అనుకుంటున్నాను. యాషెస్ సిరీస్‌లో అతను ఆడతాడని నేను అనుకోవడం లేదు. చివరి రెండు టెస్టుల తరువాత కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీని తెగ ఇబ్బంది పెడుతోన్న అండర్సన్.. కెరీర్ చివరి దశలో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు’ అని పేర్కొన్నాడు.

2015 లో వన్డే-టీ 20 నుంచి నిష్క్రమించాడు.. నవంబర్ నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీంల మధ్య యాషెస్ సిరీస్ జరగనుంది. కానీ, ఆస్ట్రేలియాలో కరోనా కేసుల కారణంగా, సిరీస్ భవిష్యత్తుపై సంక్షోభం ఉంది. అటువంటి పరిస్థితిలో, జేమ్స్ ఆండర్సన్ త్వరలో తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు ఎక్కువయ్యాయి. అతను తన టెస్ట్ కెరీర్‌ను పొడిగించుకోవడానికి 2015 లో వన్డే, టీ 20 క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ఇటీవల ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఆడాల్సి ఉంది. కానీ, భారత్‌తో సిరీస్‌ ఆడేందుకు హండ్రెస్ టోర్మెమెంట్‌ నుంచి తప్పుకున్నాడు. ఇటీవలి కాలంలో, అతను కూడా గాయాల బారిన పడ్డాడు. దీని కారణంగా అండర్సన్ చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు.

Also Read:

Tokyo Paralympics:10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌ చేరిన మనీష్ నర్వాల్, సింఘరాజ్ అధనా.. నిరాశపరిచిన రుబినా..!

Ranji Trophy 2021: ఒకే గ్రూపులో తలపడనున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ టీంలు.. జనవరి 5 నుంచి పోరు షురూ..!

‘ముందుండి నడిపించడం కాదు.. మిగతా వారి నుంచి అత్యుత్తమ ఆటను రాబట్టండి’: కోహ్లీకి మాజీ కోచ్ సూచన