IPL 2021: ‘ఈ స్టంట్ పేరు జాన్ సేనా.. నా పేరు సురేష్ రైనా’ అంటోన్న సీఎస్‌కే ప్లేయర్.. నెట్టింట్లో దూసుకపోతోన్న డబ్ల్యూడబ్ల్యూఈ వీడియో
Suresh Raina: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా మైదానంలోనూ, వెలుపల ఫుల్ జోష్‌లో ఉంటాడు.
IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా మైదానంలోనూ, వెలుపల ఫుల్ జోష్‌లో ఉంటాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే నెల సెప్టెంబర్ 19 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తిరిగి ప్రారంమయ్యేందుకు సిద్ధమవుతోంది. భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా లీగ్‌ను ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ యూఏఈలో ఐపీఎల్ 2021 రెండవ సీజన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ 2021 లో మొదటి 7 ఆటలలో రైనా ఒక అర్ధ సెంచరీతో 123 పరుగులు సాధించాడు.
తాజాగా రైనా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో తన సహచరుడు కేఎం ఆసిఫ్‌తో కొన్ని డబ్ల్యూడబ్ల్యూఈ స్టంట్‌లను ప్రదర్శించాడు. ఈ మేరకు “దీని పేరు జాన్ సేనా.. నా పేరు సురేష్ రైనా” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఇప్పటివరకు రైనా ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, 39 అర్ధ సెంచరీలతో 5,491 పరుగులు సాధించాడు. 136.89 స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా ఆడుతూ రెండవ స్థానంలో నిలిచింది.
గతనెలలో స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ కనెక్ట్’ లో మాట్లాడుతూ.. సీఎస్‌కే అభిమానులకోసం ఐపీఎల్ 2021 గెలవాలని ఉందని రైనా తెలిపాడు. యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ సెకండ్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో ముంబై టీం తలపడనుంది.
“నేను, సీఎస్‌కే కప్టెన్ ధోని భాయ్ కలిసి టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున చాలా మ్యాచ్‌లు ఆడాం. మేమిద్దరం కలిసి చాలా ట్రోఫీలు గెలిచాం. చాలా ఫైనల్స్‌లో ఓడిపోయాం కూడా. మాకు ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటుంది. నేను ధోని భాయ్ నుంచి చాలా నేర్చుకున్నాను. అతను నాకు సోదరుడిలాంటివాడు” అంటూ చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
Also Read: