54 నిమిషాల బ్యాటింగ్.. 34 బంతుల్లో మ్యాచ్ ఫలితం తారుమారు.. సునామీ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్ధిని ఏకిపారేశాడు..

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Aug 31, 2021 | 5:55 PM

23 ఏళ్ల కరేబియన్ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్ధి బౌలర్లను ఏకిపారేశాడు. తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 54 నిమిషాల పాటు క్రీజులో ఉన్న ఈ ఆటగాడు..

54 నిమిషాల బ్యాటింగ్.. 34 బంతుల్లో మ్యాచ్ ఫలితం తారుమారు.. సునామీ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్ధిని ఏకిపారేశాడు..
Sherfan Rutherford
Follow us

23 ఏళ్ల కరేబియన్ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్ధి బౌలర్లను ఏకిపారేశాడు. తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 54 నిమిషాల పాటు క్రీజులో ఉన్న ఈ ఆటగాడు.. కేవలం 34 బంతుల్లో మ్యాచ్ ఫలితాన్ని మొత్తం మార్చేశాడు. తన జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించాడు. ఇక అతడెవరో కాదు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌లో నెవిస్ పేట్రియాట్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్ తన సునామీ బ్యాటింగ్‌ను చూపించాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసింది. పాకిస్థాన్ సీనియర్ ప్లేయర్ మహ్మద్ హఫీజ్ 59 బంతుల్లో 70 పరుగులు చేయగా.. హెట్‌మెయిర్ 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇక 167 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు.. ఓపెనర్లు మంచి ఆరభాన్ని ఇచ్చారు. థామస్, ఎవిన్ లూయిస్ మొదటి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ సర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ సద్వినియోగం చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచి గయానా వారియర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రూథర్‌ఫోర్డ్ 170.58 స్ట్రైక్ రేట్‌తో 34 బంతుల్లో 6 సిక్సర్లు, 1 ఫోర్‌తో అజేయంగా 58 పరుగులు చేశాడు. రూథర్‌ఫోర్డ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కాగా, నెవిస్ పేట్రియాట్స్ జట్టు సీపీఎల్ 2021లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.

ఇవి చదవండి:

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu