26 బంతుల్లో 112 పరుగులు.. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు.. రికార్డులనే భయపెట్టాడు.. అతడెవరంటే!

గత ఐదేళ్లుగా వన్డేలు, టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టు రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇయాన్ మోర్గాన్ సారధ్యం వహించిన ఇంగ్లాండ్ జట్టు.. నాడు ఆస్ట్రేలియా..

26 బంతుల్లో 112 పరుగులు.. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు.. రికార్డులనే భయపెట్టాడు.. అతడెవరంటే!
Alex Hales
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Aug 30, 2021 | 8:54 PM

గత ఐదేళ్లుగా వన్డేలు, టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టు రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇయాన్ మోర్గాన్ సారధ్యం వహించిన ఇంగ్లాండ్ జట్టు.. నాడు ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లను చూసి.. ప్రత్యర్ధి జట్లు వణికిపోతున్నాయి. ఇక ఇంగ్లాండ్ సృష్టించిన రికార్డులలో ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం పాకిస్థాన్ జట్టుపై మోర్గాన్ సేన విధ్వంసం సృష్టించింది. ఇంగ్లాండ్ విధించిన భారీ లక్ష్యాన్ని చేధించడంలో పాక్ జట్టు విఫలమై పరాజయాన్ని ఎదుర్కుంది.

సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ జాసన్ రాయ్ ఆరో ఓవర్‌లోనే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్‌కు వన్ డౌన్‌లో వచ్చిన జో రూట్ సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి కేవలం 31.4 ఓవర్లలో 248 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రూట్ 85 పరుగులకు ఔట్ అయ్యాడు.

హేల్స్ 26 బంతుల్లో 112 పరుగులు..

గత రెండు సంవత్సరాలుగా అలెక్స్ హేల్స్ ఇంగ్లాండ్ జట్టులో ఉండకపోవచ్చు. కానీ అంతకముందు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ జట్టులో అతడు కీలక సభ్యుడు. విధ్వంసకర ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక అదే పని చేశాడు. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 83 బంతుల్లో సెంచరీ చేసిన హేల్స్.. కేవలం 122 బంతుల్లోనే 171 పరుగులు చేసి తన కెరీర్‌లో అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు. ఇందులో 26 బంతుల్లో (22 ఫోర్లు, 4 సిక్సర్లు) 112 పరుగులు చేశాడు.

బట్లర్-మోర్గాన్ కూడా వేగంగా పరుగులు సాధించారు..

37వ ఓవర్‌లో అలెక్స్ హేల్స్ ఔట్ అయినప్పటికీ.. ఆ తర్వాత బరిలోకి దిగిన జోస్ బట్లర్.. కెప్టెన్ మోర్గాన్‌తో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. చివరి 12 ఓవర్లలో ఇద్దరూ 161 పరుగులు చేసి పాకిస్థాన్‌ను రఫ్ఫాడించారు. దీనితో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది, ఆ సమయంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరుగా ప్రపంచ రికార్డుగా నమోదైంది. బట్లర్ 51 బంతుల్లో అజేయంగా 90 పరుగులు (7 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించగా, మోర్గాన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. పాకిస్తాన్ పేసర్ వహబ్ రియాజ్ అత్యధికంగా 10 ఓవర్లలో 110 పరుగులు ఇచ్చాడు. కాగా, రెండు సంవత్సరాల తర్వాత అదే మైదానంలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ తన సొంత రికార్డును బద్దలుకొట్టి..481 పరుగులతో మరో ప్రపంచ రికార్డును సాధించింది.

పాకిస్థాన్ ఘోర పరాజయం..

445 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. ఒత్తిడి కారణంగా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 108 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. షర్జీల్ ఖాన్ 30 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అమీర్ 28 బంతుల్లో 58 పరుగులతో రాణించాడు. వీరిద్దరి ప్రయత్నం జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయింది. చివరికి నిర్ణీత ఓవర్లలో పాకిస్థాన్ 42.4 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 169 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?