- Telugu News Photo Gallery Cricket photos IND vs ENG: Team India changes in Playing XI for Oval Test vs England
IND vs ENG: హెడింగ్లీ ఓటమి తర్వాత టీమిండియాలో మార్పులు.. ఓవల్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోదంటే..?
ఓవల్‌లో జరిగే నాలుగో టెస్ట్ ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో పలు మార్పులు రానున్నాయి. విజయం కోసం టీమిండియా స్టార్ బౌలర్‌ను తుది జట్టులోకి తీసుకరానున్నట్లు తెలుస్తుంది.
Updated on: Aug 30, 2021 | 5:40 PM

హెడింగ్లీలో ఓటమితో టీమిండియాపై దుమారం రేపింది. విరాట్ కోహ్లీ మొండి నిర్ణయాలతోనే టీమిండియా ఓడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అందరూ టీంలో మార్పులను చేయాలంటూ మాట్లాడుతున్నారు. ఇన్నింగ్స్ 76 పరుగుల ఓటమి తర్వాత నాలుగో టెస్టు కోసం తప్పకుండా మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఓవల్‌లో జరిగే నాలుగో టెస్ట్ ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ముఖచిత్రం మారబోతున్నట్లు స్పష్టమైంది. ఇలాంటి పరిస్థితిలో, ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఎవరు రావచ్చు.. ఏ ఆటగాడిపై వేటు పడొచ్చో చూద్దాం.

ఆర్. అశ్విన్‌ను.. విరాట్ కోహ్లీ జట్టుకు దూరంగా ఉంచాలనే నిర్ణయంతో ఎవరూ అంగీకరించడం లేదు. మాజీలు కూడా కోహ్లీపై మండిపడుతున్నారు. కానీ, విరాట్ కోహ్లీ తనకు నచ్చినట్లు చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో అవరసరం లేదంటూ మాట్లాడుతున్నాడు. అయితే మూడో టెస్ట్ ఫలితంతో కోహ్లీపై తీవ్రంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఓవల్‌లో జరిగే నాల్గవ టెస్టులో అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, సిరీస్ సమం చేసిన తర్వాత, భారత జట్టుకు నాలుగో టెస్టులో విజయం తప్పనిసరి. అలాగే రెండవది రవీంద్ర జడేజా గాయపడ్డాడు. అతని స్థానంలో అశ్విన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మూడవది, అతి ముఖ్యమైనది ఏమిటంటే, సిరీస్ ప్రారంభానికి ముందు సర్రే కోసం అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మైదానంలోనే నాలుగో టెస్టు జరగనుంది.

ఓవల్ టెస్ట్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండవ మార్పు అజింక్య రహానె రూపంలో ఉంటుంది. రహానె జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, అతని బ్యాటింగ్ ఏమాత్రం బాగోలేదు. ఫాంలో లేకపోవడంతో పరుగులు సాధించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన టెస్ట్ సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌లలో 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఈ ముంబైకర్ బ్యాట్స్‌మన్‌కు బదులుగా, మరొక ముంబైకర్‌కు ఆహ్వానం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రహానే స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలని భారత మాజీ బ్యాట్స్‌మెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కోరుతున్నాడు.

ఓవల్‌లో, టీమిండియా హనుమ విహారికి కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇవ్వొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. హనుమ విహారిని జట్టులో చేర్చడం వలన టీమిండియా బ్యాటింగ్‌తో పాటు స్పిన్ విభాగాలు మరింత బలపడొచ్చని తెలుస్తోంది. ఒకవేళ హనుమ జట్టులో చేరితే, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో వెళ్లాల్సి ఉంటుంది. షమీ, బుమ్రా, సిరాజ్ మాత్రమే ఫాస్ట్ బౌలింగ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కావచ్చు. ఈ సందర్భంలో ఇషాంత్ శర్మపై వేటు పడొచ్చు.





























