- Telugu News Photo Gallery Cricket photos Indian women cricket team fly to australia series starts from 21st september
INDW vs AUSW: ఆస్ట్రేలియా చేరిన టీమిండియా మహిళల జట్టు.. విమానంలో సందడే సందడి
భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
Updated on: Aug 30, 2021 | 5:47 PM

భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ జట్టు తదుపరి సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. జట్టు ప్లేయర్ పూనమ్ రౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. భారత జట్టు దుబాయ్ మీదుగా బ్రిస్బేన్ వెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత 14 రోజుల క్వారంటైన్ నియమాలను పాటించనుంది. జట్టు నిర్బంధం సెప్టెంబర్ 13 తో ముగుస్తుంది. ఆ తర్వాత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.

ఈ పర్యటనలో భారత్ చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది. భారత మహిళల జట్టు ఇక్కడ మొదటి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతుంది.

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, టీ20 సిరీస్‌లు ఆడనుంది. అయితే, జట్టు షెడ్యూల్‌లో కొన్ని మార్పులు జరిగాయి. పర్యటన వన్డే సిరీస్‌తో ప్రారంభం కావాల్సి ఉంది. సిరీస్‌లోని మొదటి వన్డే సెప్టెంబర్ 19 న జరగాల్సి ఉంది. కానీ, ఈ మ్యాచ్ 21 సెప్టెంబర్‌న జరగనుంది.

ఈ పర్యటన కోసం భారత మహిళా జట్టులో 22 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇది కాకుండా, జట్టు సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే సెలెక్షన్ కమిటీలో ఇద్దరు సభ్యులు, నీతూ డేవిడ్, చీఫ్ సెలెక్టర్ వి. కల్పన కూడా ఆ జట్టుతో ఆస్ట్రేలియాలో ఉంటారు.





























