Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవాళీ క్రికెట్‌లో 10వేల పరుగులతో దుమ్ము లేపాడు.. టీమిండియా తరపున మాత్రం విఫలం.. కేవలం 10 మ్యాచ్‌లతోనే కెరీర్ ఖతం.. అతనెవరంటే?

ఈ ఆటగాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10 వేలకు పైగా పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ బ్యాట్‌తో సందడి చేశాడు. 10 మ్యాచ్‌ల తరువాత కెరీర్ ముగిసిపోయింది.

దేశవాళీ క్రికెట్‌లో 10వేల పరుగులతో దుమ్ము లేపాడు.. టీమిండియా తరపున మాత్రం విఫలం.. కేవలం 10 మ్యాచ్‌లతోనే కెరీర్ ఖతం.. అతనెవరంటే?
S Badrinath
Follow us
Venkata Chari

|

Updated on: Aug 30, 2021 | 2:12 PM

అనుభవజ్ఞుల కారణంగా అంతర్జాతీయ కెరీర్ ముందుకు సాగని ఓ భారత బ్యాట్స్‌మెన్ పుట్టినరోజు నేడు. ఈ బ్యాట్స్‌మన్‌ను మిస్టర్ డిపెండబుల్ అని కూడా పిలుస్తారు. కానీ, టీమిండియా కోసం ఎక్కువ కాలం ఆడలేదు. ఈ ఆటగాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం 10 వేలకు పైగా పరుగులు చేసి, ఐపీఎల్‌లో కూడా బ్యాట్‌తో సందడి చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌టీంలో భాగమైన అతను వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కానీ, టీమిండియా తరపున బరిలోకి దిగిన ప్రతీ మ్యాచులో విఫలమయ్యాడు. చాలాసార్లు అలానే జరిగింది. ఆ ఆటగాడు మరెవరో కాదు సుబ్రమణ్యం బద్రీనాథ్. దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరపున సందడి చేసిన బద్రీనాథ్.. అత్యంత ప్రతిభావంతులైన బ్యాట్స్‌మన్. కానీ, అతను రెండు టెస్టులతో సహా టీమిండియా తరపున మొత్తం 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

బద్రీనాథ్ టెస్ట్, వన్డే, టీ 20 ఇలా మూడు ఫార్మాట్లలోని టీమిండియా తరపున ఆడిన మొదటి మ్యాచ్‌లు ఎంతో చిరస్మరణీయమైనవిగా నిలిచాయి. తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక అర్ధశతకం సాధించాడు. తొలి వన్డేల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే తొలి టీ 20 లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. బద్రీనాథ్ 145 దేశవాలి మ్యాచ్‌లలో 54.49 సగటుతో 10245 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 32 సెంచరీలు సాధించాడు. జాబితా Aలో 144 మ్యాచ్‌లలో 36.84 సగటుతో 4164 పరుగులు చేశాడు. అదే సమయంలో, బద్రి 142 టీ 20 మ్యాచ్‌లలో 2300 పరుగులు సాధించాడు. అతను భారతదేశం తరపున ఏడు వన్డేలు మాత్రమే ఆడాడు. అత్యధికంగా 79 పరుగులు చేశాడు. అతను ఈ మ్యాచ్‌లన్నీ శ్రీలంక, వెస్టిండీస్‌ టీంలపై ఆడాడు. 2011 లో, అతను చివరిగా భారతదేశం తరపున ఒక వన్డే మ్యాచ్ ఆడాడు.

తొలి టీ 20 లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతను 2010 లో దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్‌లో తన తొలి టెస్టును ఆడాడు. తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేశాడు. కానీ, అతని కెరీర్‌లో రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. 2011 లో వెస్టిండీస్‌తో టీ 20 లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 43 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆ తరువాత మరోసారి టీమిండియా తరపున టీ 20 మ్యాచ్‌ ఆడలేదు. అనంతరం ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ, బౌలింగ్ చేయగలిగితే తన అంతర్జాతీయ కెరీర్ సుదీర్ఘంగా ఉండేదని ఒప్పుకున్నాడు.

బద్రీనాథ్ 2008 నుంచి 2013 వరకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్నారు. ఈ సమయంలో అతను 95 మ్యాచ్‌లు ఆడాడు. 1441 పరుగులు చేశాడు. 11 అర్ధ సెంచరీలు బాదేశాడు. ఐపీఎల్ 2014 వేలంలో అతనిని ఏ టీం తీసుకోలేదు.

Also Read: IND vs ENG: నాలుగో టెస్టు బరిలో టీమిండియా స్టార్ బౌలర్.. గెలవాలంటే మార్పులు తప్పవంటోన్న విరాట్ కోహ్లీ..!

అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన టీమిండియా ఆల్‌రౌండర్.. 2014లో కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు.. అతనెవరో తెలుసా!