రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌ ఈ భారత మాజీ బౌలర్.. వన్డేల్లో సరికొత్త చరిత్రతో షార్జా ‘షహెన్‌షా’ గా ఎదిగాడు.. అతనెవరో తెలుసా?

వన్డే అరంగేట్రం చేసిన రెండు నెలల తర్వాత, ఆస్ట్రేలియాపై ఈ ఆటగాడు టెస్ట్ అరంగేట్రం చేశాడు. అనేక రికార్డులు సృష్టించడమే కాకుండా బౌలింగ్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు.

రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌ ఈ భారత మాజీ బౌలర్.. వన్డేల్లో సరికొత్త చరిత్రతో షార్జా 'షహెన్‌షా' గా ఎదిగాడు.. అతనెవరో తెలుసా?
Javagal Srinath
Follow us
Venkata Chari

|

Updated on: Aug 31, 2021 | 6:48 PM

Javagal Srinath: ప్రపంచం మొత్తం ఆయనను మైసూర్ ఎక్స్‌ప్రెస్ అని పిలిచేవారు. కపిల్ దేవ్ తర్వాత ఫాస్ట్ బౌలింగ్‌లో భారతదేశం తరపున గుర్తింపు పొందాడు. కర్ణాటక నుంచి వచ్చి ప్రపంచవ్యాప్తంగా పిచ్‌లపై భారతదేశ జెండాను ఎగురవేశాడు. టీమిండియా అనేక సాటిలేని విజయాలకు మారుపేరుగా నిలిచాడు. ఈ ఆటగాడు మరెవరో కాదు, ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్. నేడు ఆ‍యన 52 వ పుట్టినరోజు. శ్రీనాథ్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. కానీ, ఈ గేమ్‌పై ఉన్న మక్కువ అతడిని ఈ రోజు కూడా ఈ గేమ్‌తో కనెక్ట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం మ్యాచ్ రిఫరీగా పనిచేస్తున్నాడు.

క్రికెట్‌లో జవగల్ శ్రీనాథ్ అంతర్జాతీయ ప్రయాణం 1991వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ సంవత్సరం అక్టోబర్‌లో, అతను పాకిస్తాన్‌తో తన మొదటి వన్డే ఆడాడు. పాకిస్థాన్‌తో ఆడిన మొదటి వన్డే మ్యాచ్‌లో, శ్రీనాథ్ 9 ఓవర్లలో 1 మైడెన్ విసిరాడు. 31 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు. మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో 3.44 ఎకానమితో పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

రికార్డులకు కేరాఫ్ అడ్రస్ శ్రీనాథ్.. వన్డే అరంగేట్రం చేసిన రెండు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో శ్రీనాథ్ టెస్టు అరంగేట్రం చేశాడు. అతను ఒక దశాబ్దం పాటు తన క్రికెట్ కెరీర్‌లో అనేక రికార్డులు నెలకొల్పాడు. 1996-97లో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అతను కేవలం 21 పరుగులకే 6 వికెట్లు తీసుకున్నాడు. 1998-99లో పాకిస్థాన్‌తో జరిగిన కలకత్తా టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి, మొత్తం 13 వికెట్లు తీసుకున్నాడు. 315 వికెట్లతో అనిల్ కుంబ్లే 337 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో 300 ప్లస్ వికెట్లు తీసిన ఏకైక భారతీయ పేసర్‌గా నిలిచాడు.

శ్రీనాథ్ షార్జా చక్రవర్తిగా మారాడు.. శ్రీనాథ్ షార్జా చక్రవర్తిగా మారాడు. షార్జా క్రికెట్ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా నిలిచాడు. అతడి పేరు మీద 39 వికెట్లు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 500 కి పైగా వికెట్లు తీసిన శ్రీనాథ్, ప్రపంచంలోని 11 మంది బౌలర్లలో ఏకైక భారతీయ పేసర్‌గా నిలిచాడు. అతని పేరుపై 300 వికెట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో 2003 క్రికెట్ ప్రపంచ కప్ ఆడిన తర్వాత జవగల్ శ్రీనాథ్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయ్యాడు.

Also Read:

Tokyo Paralympics: రజతం గెలిచిన మరియప్పన్ తంగవేలు, హైజంప్‌లో శరద్ కుమార్ ‌కు కాంస్యం..!

పారాలింపిక్స్‌లో దుమ్ములేపుతున్న భారత అథ్లెట్స్.. ఖాతాలోకి మరో రెండు పతకాలు..

54 నిమిషాల బ్యాటింగ్.. 34 బంతుల్లో మ్యాచ్ ఫలితం తారుమారు.. సునామీ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్ధిని ఏకిపారేశాడు..

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!