AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dale Steyn: అతడు బంతి విసిరితే బ్యాట్స్‌మెన్‌కి దడే..! క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన ఫాస్ట్ బౌలర్‌..

Dale Steyn: ప్రముఖ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లలో డేల్‌ స్టెయిన్ ఒకరు. అద్భుతమైన పేస్, బంతిని రెండు వైపులా

Dale Steyn: అతడు బంతి విసిరితే బ్యాట్స్‌మెన్‌కి దడే..! క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన ఫాస్ట్ బౌలర్‌..
Dale Steyn
uppula Raju
|

Updated on: Aug 31, 2021 | 7:51 PM

Share

Dale Steyn: ప్రముఖ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లలో డేల్‌ స్టెయిన్ ఒకరు. అద్భుతమైన పేస్, బంతిని రెండు వైపులా కదిలించే సామర్థ్యం అతని సొంతం. అతను 93 టెస్టుల్లో 439 వికెట్లు, 125 వన్డేల్లో 196 వికెట్లు, 47 టి 20 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు సాధించాడు. ఈ విధంగా డేల్ స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 699 వికెట్లు తీసుకున్నాడు. డేల్ స్టెయిన్ 2004 లో టెస్టుల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

తరువాత క్రమంగా వన్డేలు, టీ 20 ల్లో కూడా అరంగ్రేటం చేశాడు. తన కిల్లర్ బౌలింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాడు. దీని కారణంగా క్రికెట్ అభిమానులు అతడిని ‘స్టెంగన్’ అని పిలుస్తారు. డేల్ స్టెయిన్ రిటైర్మెంట్‌ సందేశంలో ఈ విధంగా మాట్లాడారు. ’20 సంవత్సరాల శిక్షణ, మ్యాచ్‌లు, ప్రయాణాలు, విజయాలు, ఓటములు చెప్పడానికి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా మందికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ రోజు నేను క్రికెట్ నుంచి అధికారికంగా రిటైర్ అయ్యాను. కొద్దిగా బాధ ఉంది కానీ అందరికి ధన్యవాదాలు’ చెప్పారు.

2008లో డేల్ స్టెయిన్ దక్షిణాఫ్రికా తరఫున వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతను 14 మ్యాచ్‌లలో 18.10 సగటుతో 86 వికెట్లు తీసుకున్నాడు. ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అతను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2010 సంవత్సరంలో డేల్ స్టెయిన్ భారతీయ పిచ్‌లపై తన కళాత్మకతను చూపించాడు. నాగ్‌పూర్‌లో 51 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా భారతదేశాన్ని ఓడించింది.

అయితే అతని కెరీర్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ గాయాల బాధ కూడా ఎక్కువయింది. స్టెయిన్ వేగవంతమైన 400 టెస్ట్ వికెట్ల రికార్డును సాధించాడు. డేల్ స్టెయిన్ చాలా సంవత్సరాలు ఐపిఎల్‌లో కూడా ఆడాడు. అతను డెక్కన్ ఛార్జర్స్, గుజరాత్ లయన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ స్టెయిన్‌పై చాలా విశ్వాసం చూపించాడు. అతను చివరిసారిగా ఐపిఎల్‌లో ఆర్‌సిబి కోసం ఆడాడు. అప్పుడు స్టెయిన్ పూర్తిగా ఫిట్‌గా లేడు కానీ కోహ్లీ అతనిపై నమ్మకం ఉంచాడు.

MRP గురించి అందరికీ తెలుసు కానీ FRP గురించి తెలుసా..? కచ్చితంగా అవసరం తెలుసుకోండి..

Hyderabad Rains: భారీగా చేరుతున్న వరదనీరు.. హిమాయత్ సాగర్ రిజ్వాయర్ గేట్లు ఎత్తివేత

Gautham Ghattamaneni Photos:తగ్గేదే..లే అందం,ఫాలోయింగ్‌లో తాతకు, తండ్రికి పోటీ.. ఘట్టమనేని వారసుడి పుట్టినరోజు స్పెషల్ ఫొటోస్