MRP గురించి అందరికీ తెలుసు కానీ FRP గురించి తెలుసా..? కచ్చితంగా అవసరం తెలుసుకోండి..
Fair Remunerative Price: మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దాని ధర ఆ వస్తువుపై ఉంటుంది. దానినే MRP (maximum retail price) అంటారు. తెలుగులో గరిష్ట చిల్లర ధర.
Fair Remunerative Price: మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దాని ధర ఆ వస్తువుపై ఉంటుంది. దానినే MRP (maximum retail price) అంటారు. తెలుగులో గరిష్ట చిల్లర ధర. దుకాణ దారుడు ఏ వస్తువునైనా సరే MRP ధరకు మించి విక్రయించకూడదు. ఒకవేళ ఎక్కువ ధరకు అమ్మితే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు వినియోగదారుల కోర్టులో కూడా కేసు వేయవచ్చు. చాలా మందికి MRP గురించి తెలుసు. కానీ FRP గురించి ఎవ్వరికి తెలియదు. దీని గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
FRP అంటే ఏమిటి? FRP అంటే (fair remunerative price) అంటారు. తెలుగులో సరసమైన ధర అని అర్థం. ఇది రైతుల పంట లేదా ఉత్పత్తికి సంబంధించినది. FRP అనేది వ్యవసాయ ఉత్పత్తుల సరసమైన ధర. FRP నియమాన్ని కేంద్ర ప్రభుత్వం విధించింది. దీనివల్ల రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు సరైన న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యం అమ్ముకోవచ్చు.
ఉదాహరణకు.. ఇలా అర్థం చేసుకోండి మన దేశంలో అనేక రకాల పంటలు పండిస్తారు. ఈ పంటలలో చెరకు ఒకటి. దేశంలో చక్కెర, బెల్లం మంచి ధరకు విక్రయిస్తారు కానీ చెరకు రైతులకు మాత్రం సరైన ధర లభించడం లేదు. చెరకు పండించే రైతులు పంటను చక్కెర మిల్లులకు, ప్రభుత్వానికి విక్రయిస్తారు. దీని కోసం ప్రభుత్వం FRP రేట్‌ని నిర్ణయిస్తుంది. చెరకు FRP ప్రతి సంవత్సరం స్థిరంగా ఉండదు మారుతూ ఉంటుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం FRP క్వింటాల్‌కు రూ.290 కి పెంచామన్నారు.