International Steals Fest: కరోనా నిబంధనలతో పర్యాటకులను ఆహ్వానిస్తున్న కొన్ని దేశాలు.. బెస్ట్ ఛాయిస్‌గా ఈ ఐదు దేశాలు..
International Steals Fest: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్కడివారు అక్కడే అన్నట్లు జీవితం గడిపేస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వేగవంతం కావడంతో కొన్ని ప్రాంతాలు పర్యాటకులను కొన్ని..
International Steals Fest: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్కడివారు అక్కడే అన్నట్లు జీవితం గడిపేస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వేగవంతం కావడంతో కొన్ని ప్రాంతాలు పర్యాటకులను కొన్ని షరత్తులతో ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా రొటీన్ లైఫ్ తో బోరు కొట్టిన వారు డిఫరెంట్ ప్లేస్ లకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు పర్యటనకు వెళ్ళడానికి ఆసక్తి, కొత్త వాతావరణం.. కొత్త వంటలను రుచి చూడాలనుకునేవారికి ఈ ఐదు దేశాలు అత్యుత్తమం.. ఈ దేశాలు కరోనా నిబంధనలను పాటిస్తూ.. అన్ని భద్రతా ప్రోటోకాల్ లు అనుసరిస్తూ.. తమ దేశాల్లోని పర్యాటక ప్రాంతాలను తెరుస్తున్నారు. ఈ మేరకు నెమ్మదిగా పర్యాటకులను అనుమతిస్తున్నారు. తాజాగా CRED ఆగష్టు 27 నుండి సెప్టెంబర్ 1 వరకు ‘ఇంటర్నేషనల్ స్టీల్స్’ ఫెస్టివల్ సందర్భంగా తన సభ్యులకు భారీ ఆఫర్స్ ను ప్రకటించింది. విదేశాల్లో పర్యటించాలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా పర్యాటకులు ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ తో 2022 వరకు ప్రయాణించవచ్చు. ఐదు రోజుల టూర్. బుకింగ్ చేసుకుంటే మాల్దీవులు, రష్యా, యుఎఇ, ఫ్రాన్స్ , దక్షిణ ప్రాంతాలు ఇలా 35 ఎంపిక చేసిన అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలను దర్శించవచ్చు.
రష్యా: రష్యా పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన దేశం. అందమైన ప్రకృతి, అద్భుతమైన కళలు, విశాలమైన కోటలు, ఆధునిక షాపింగ్ మాల్‌లు, అధునాతన బార్‌లు , సోవియట్ కాలం నాటి ఆర్కిటెక్చర్‌లో నిర్మించిన రెస్టారెంట్ల వరకు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మీరు కనుక రష్యాలో పర్యటించడానికి ఎంచుకుంటే మంచి అనుభూతిని పొందవచ్చు..
యుఎఇ: అందమైన బీచ్‌లు, నారింజ-ఎరుపు దిబ్బలు, ఆకాశహర్మ్యాలు ప్రపంచంలోని పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. దుబాయ్‌తో ప్రారంభించి ఈ యాత్ర సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుంటూ.. షార్జా గొప్పదనం వరకూ పర్యటిస్తారు.
దక్షిణాఫ్రికా: భౌగోళిక , సాంస్కృతిక వైవిధ్యం ఈ దేశం సొంతం.. వన్యప్రాణులు, అందమైన ద్రాక్షతోటలు పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ఇక సాహసాలను ఇష్టపడే వ్యక్తులకు అనువైన గమ్యస్థానం దక్షిణాఫ్రికా. తెల్ల సొరచేపలతో డైవింగ్ వంటివి థ్రిల్లింగ్ ను ఇస్తాయి. కేప్‌టౌన్ , జోహన్నెస్‌బర్గ్ వంటి నగరాల్లో షాపింగ్ పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తాయి.
ఫ్రాన్స్: ప్రపంచ సంస్కృతి అంతా కనిపించే దేశం ఫ్రాన్స్. డిఫరెంట్ వంటకాలు, చక్కటి వైన్‌లు, రొమాంటిక్ చాకోలెట్స్ , సుందరమైన గ్రామీణ ప్రాంతాలు ప్రజలను ఆకర్షిస్తాయి. ఫ్రాన్స్ అనగానే ఎవరికైనా మదిలో తట్టేది ఈఫిల్ టవర్ .. ఈ సుందర నగరంలో ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటూ.. చూడాలనిపిస్తుంది. బోర్డియక్స్ లో అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూడటానికి సందర్శకులు క్యూ కడతారు.
మాల్దీవులు: కొత్తగా పెళ్ళైన జంటలకు హనీమూన్ ట్రిప్ కు అనువైన ప్రదేశం మాల్దీవులు. తెల్లని ఇసుక బీచ్‌లు, అద్భుతమైన విల్లాలు ప్రపంచవ్యాప్తంఉన్న పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ సర్ఫింగ్, స్నార్కెలింగ్, క్రూయిజింగ్, స్కూబా డైవింగ్ వంటి జల క్రీడలకు పెట్టింది పేరు. నీటిలో సాహస క్రీడలను ఇష్టపడే వారికీ మంచి ఛాయిస్ మాల్దీవుల పర్యటన.
Also Read: Moral Story: మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి.. అనుకోకుండా వచ్చిన తన అదృష్టాన్ని చూసి విర్రవీగితే కష్టాలపాలవుతారు