AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి.. అనుకోకుండా వచ్చిన తన అదృష్టాన్ని చూసి విర్రవీగితే కష్టాలపాలవుతారు

Moral Story in Bhagavatam: ఒకటి రెండు తరాల ముందు వరకూ ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.. సాయంత్రం అయితే చాలు పిల్లలు నానమ్మ తాతయ్యల ఒడిలో కూర్చుని.. గారాలు పోతూ..

Moral Story: మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి.. అనుకోకుండా వచ్చిన తన అదృష్టాన్ని చూసి విర్రవీగితే కష్టాలపాలవుతారు
Crow And Swan
Follow us
Surya Kala

|

Updated on: Aug 31, 2021 | 6:05 PM

Moral Story in Bhagavatam: ఒకటి రెండు తరాల ముందు వరకూ ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.. సాయంత్రం అయితే చాలు పిల్లలు నానమ్మ తాతయ్యల ఒడిలో కూర్చుని.. గారాలు పోతూ.. వారు చెప్పే భాగవతం,మహాభారత, రామాయణంలోని నీతి కథలను వినేవారు.. అవి జీవితంలో ఎదురైనా ఆటుపోట్లను తట్టుకుని మనిషి ఎలా ఎదగాలో.. ఎంత ఎదిగినా మనిషి ఎలా ఒదిగి జీవించాలో నేర్పేవి.. ఏ పాఠ్యపుస్తకం నేర్పని జీవిత విధాన్ని బాల్యంలో నేర్చుకునేవారు.. అయితే కాలంలో పోటీపడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ప్లేస్ లో చిన్న కుటుంబాలు వచ్చాయి. బాల్యం చదువులు, ర్యాకుల మధ్య బంధీ అయిపొయింది. అయితే మహాభారతంలోని నీతి కథలు మన పిల్లలకు మార్గదర్శకాలుగా నిలబడతాయి. ఈరోజు మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి.. అంతేకాని అనుకోకుండా వచ్చిన తన అదృష్టాన్ని చూసి విర్రవీగి.. ఎదుటివారిని చులకన చేయాలని చూస్తే గర్వ భంగం అవుతుంది.. అవమానభారంతో తలదించుకోవాల్సి వస్తుంది.. ఇదే విషయాన్ని భాగవతంలోని చెప్పిన ఓ కథని చూద్దాం..

పూర్వం ఓ ధనిక వర్తకుడు ఉండేవాడు. అతనికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలూ ఓ కాకిని పెంచుకోసాగారు. ఆ పిలల్లు పెట్టె ఆహారాన్ని తిన్న ఆ కాకి గుండ్రంగా తయారైంది. తనలాంటి పక్షి ఈ భూమి మీద లేదు అనే స్టేజ్ కు చేరుకుంది. రోజు రోజుకీ ఆ కాకికి పొగరు పెరిగిపోయి.. మిగిలిన పక్షులను చాలా చులకనగా చూడసాగింది. ఓ రోజు హంసల గుంపు వినువీధిలో ఎగురుతూ కాకికి కనిపించాయి. వాటిని చూసి.. కాకి ఎద్దేవా చేస్తూ.. నేను నూటొక్క రకాలుగా ఎగరగలను ఒకో భంగిమలోను వందల యోజనాలు ప్రయాణించగలను. నాతో పోటీ పడి చూడండి అంటూ హంసలను తక్కువ చేసి మాట్లాడింది. అయితే హంసల గుంపు లోని ఒక హంస కాకిని సమాధాన పరిచే ప్రయత్నం చేస్తూ.. మేము ఎక్కడో మానససరోవరం నుంచీ ప్రయాణిస్తున్నాం.. దూరాలను ప్రయాణించగలం కనుకనే లోకం మమ్మల్ని గౌరవిస్తుంది. మాతో నీకు పోటీ ఏంటి అంటూ కాకిని సమాధానపరిచే ప్రయత్నం చేసింది. అయితే పొగరుతో ఉన్న కాకికి మంచి మాటలు చెవికి ఎక్కలేదు.. ‘నాతో పోటీ అంటే భయపడి ఇలాంటి సాకులు చెబుతున్నావు. నీలో నిజంగా దమ్ముంటే నాతో పోటీకి రా!’ అంటూ రెచ్చగొట్టింది. దాంతో కాకి, హంస పోటీకి సిద్ధమయ్యాయి. కాకికి హంసలు ఎంత నచ్చ చెప్పినా తన మంకు పట్టు విడకపోవడంతో హంస కాకితో పోటీకి దిగింది . దీంతో రెండు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాయి. కాకి సంతోషంగా తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించడం మొదలుపెట్టింది. గాలిలో పల్టీలు కొడుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఎగరడం మొదలు పెట్టింది. హంస మాత్రం నిందానంగా తనకు తెలిసిన ఒకే ఒక భంగిమలో నిదానంగా ఎగరసాగింది.

కాకి గర్వంతో హంసని చూసి నవ్వు.. ఎగతాళి చేసింది. ఇలా అయితే నువ్వు ఎప్పటికి గమ్యం చేరుకుంటావు అంటూ.. నాతో ఎగరడానికి ఎప్పటికి నువ్వు పోటీ పడలేవు అంటూ నోటికి వచ్చిన రీతిలో మాట్లాడింది. అయితే హంస మాత్రం తన దృష్టిని మరల్చలేదు.. ఒక చిన్న నవ్వు నవ్వి.. ముందుకు సాగింది. అలా ఎగురుతూ వెళ్తుండగానే తీరం దూరమైపోయింది. ఎక్కడ చూసినా నీరే కనిపించసాగింది. అప్పటికే కాకి తన విన్యాసాలతో అలసిపోయింది. కాలు మోపడానికి ఇసుక కోసం వెదుకుతుంది. దీంతో అక్కడ పరిసలను చూసిన కాకి గుండె ఝల్లుమంది. ముందుకు సాగుదామంటే ఎగరడానికి ఒంట్లో ఓపిక లేదు.. దీంతో మెల్లగా నీటిలోకి పడిపోవడం మొదలు పెట్టింది. అప్పుడు హంసను వేడుకుంటూ.. ఇక నేను ఎగరలేను.. ఓపిక లేదు.. నన్ను కాపాడు అంటూ వేడుకుంది. హంసకు కాకి తన పొగరుతో ప్రాణాలమీదకు తెచ్చుకుందని అర్ధమైంది. కాకి అంతవరకూ అన్న మాటలను పక్కకు పెట్టి.. కాకిని కాపాడాలని హంస అనుకుని.. కాకి వద్దకు చేరుకొని.. దానిని నోట కరుచుకుని ఒడ్డు మీదకు చేర్చింది.

దీంతో కాకికి జ్ఞానోదయమయ్యింది. తాను చేసిన పనికి సిగ్గుపడిన కాకి.. హంసతో మిత్రమా ఎంగిలి మెతుకులు తిని నేను పొగరుతో నిన్ను రెచ్చగొట్టి.. నా ప్రాణాలమీదకు తెచ్చుకున్నా .. నువ్వు నా మాటలను పట్టించుకోకుండా ప్రాణాలను కాపాడావు.. లేకపోతె.. నేను ఆ సముద్రంలోనే సమాధి అయ్యిపోయేదానిని.. ఇక నుంచి నేను గొప్పలకు పోను.. నన్ను క్షమించి అంటూ హంసని వేడుకుంది. కాకి మాటలు విన్న హంస నవ్వుకుంటూ వినువీధిలోకి ఎగిరిపోయింది. అందుకనే మన పెద్దలు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి.. వాపుని చూసి బలుపు అని పొగరుతో ఎగిరితే మొదటికే మోసం వస్తుందని..

Also Read: Bigg Boss Himaja: నటి.. బిగ్‌బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో అద్భుతం.. సాయిబాబా విగ్రహం నుంచి విబూది..