- Telugu News Photo Gallery Spiritual photos September 2021 festival calendar: Check out Ganesh Chaturthi, Vishwakarma puja, Ekadashi and Pradosh dates
September 2021 Festival Calendar: సెప్టెంబర్ నెలలో వచ్చే హిందూ పండగలు.. పూజా విధానం.. విశిష్టత
September 2021 Festival Calendar:హిందూ క్యాలెండర్ లో ఆరోనెల భాద్రపద మాసం.. నిజానికి హిందూ క్యాలెండర్ లో ఏడాది పొడవునా హిందువులు జరుపుకోవడానికి పండగలు వస్తూనే ఉంటాయి. ఈ సారి సెప్టెంబర్ నెలలో పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి పండగ వచ్చింది. ఈ నెలలో వచ్చిన ముఖ్యమైన హిందూ పండగలు.. పూజా విధానం తెలుసుకుందాం..
Updated on: Aug 31, 2021 | 8:30 PM

భాద్రపద మాసంలో కృష్ణ పక్షం లో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అని అంటారు. ఇక శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పార్వ ఏకాదశని అంటారు. ఈ రెండు ఏకాదశుల్లోనూ విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు. విష్ణువు పూజిస్తూ కీర్తనలు పాడతారు. ఈ నెలలో ఏకాదశులు సెప్టెంబర్ 3, 17 తేదీల్లో వచ్చాయి.

శివుడిని పూజిస్తూ ప్రదోష వ్రతం నిర్వహిస్తారు శైవ భక్తులు. చాంద్రమాన పక్షం.. పదమూడవ రోజున మహాదేవుడిని పూజిస్తూ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెల 4వ తేదీ, 18వ తేదీల్లో ఈ వ్రతం వచ్చింది.

కాజరీ తీజ్ పండగను జరుపుకున్నట్లే ఈ నెలలో మహిళలు హర్తలిక తీజ్ ను జరుపుకుంటారు. మహిళలు మంగళ గౌరిని పూజిస్తూ.. ఒకరోజు వ్రతాన్ని చేస్తారు. భర్త క్షేమం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. ఈ పండగ ఈ నెల 9న జరుపుకోనున్నారు.

భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథిన వినాయకుని జన్మదినంగా జరుపుకుంటాం. దేశ వ్యాప్తంగా వినాయకుడిని అత్యంత పవిత్రంగా ఈరోజున పూజిస్తారు. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పది రోజుల పాటు వినాయకచవితి ఉత్సవాలు జరుగుతాయి. అనంత చతుర్దశి రోజున వినాయక నిమర్జనంతో ముగుస్తుంది. ఈ నెల 10న వినాయక చవితి పండగను జరుపుకోనున్నారు.

దేవ వాస్తుశిల్పి విశ్వకర్మని కొలుస్తూ పూజలను నిర్వహిస్తారు. ఈ సారి విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17న జరుపుకోనున్నారు.

అనంత చతుర్దశిని విష్ణువుని ధ్యానిస్తూ..ఈ రోజంతా ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ఈరోజున విష్ణుడు శేషుడిపై ధ్యాన స్థితిలో విశ్రాంతి తీసుకుంటాడని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ విష్ణువు రూపాన్ని అనంత పద్మనాభస్వామి అని కూడా అంటారు. అంటే విష్ణువు నాభి నుండి తామర పై బ్రహ్మ ఉద్భవించిన రోజుని అనంత చతుర్ధిగాక్ జరుపుకుంటారు. ఈ నెల 19న వచ్చింది ఈ పండగ.




