కాశ్మీర్‌లో అత్యంత పురాతన దుర్గామాత విగ్రహం గుర్తింపు.. 1200 ఏళ్ల నాటిదిగా నిర్ధారణ
Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లా ఖాన్ సాహిబ్ ప్రాంతంలో అత్యంత పురాతనమైన దుర్గామాత విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లరాతితో చెక్కబడిన ఈ విగ్రహం..
Ancient idol of Goddess Durga: జమ్మూకాశ్మీర్‌లో అత్యంత పురాతనమైన దుర్గామాత విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లరాతితో చెక్కబడిన ఈ విగ్రహం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితంనాటిదిగా పురావస్తు అధికారులు తెలిపారు. బుద్గామ్ జిల్లా ఖాన్ సాహిబ్ ప్రాంతంలో దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆగస్టు 13న శ్రీనగర్‌లోని పంద్రెతాన్ వద్ద జీలం నదిలో స్థానిక కార్మికులు తవ్వకాలు జరుపుతుండగా ఈ విగ్రహం బయటపడింది. ఓ వ్యక్తి ఈ విగ్రహాన్ని తన దగ్గర పెట్టుకుని విక్రయించేందుకు ప్రయత్నించాడు. తమకు అందిన రహస్య సమాచారం మేరకు పోలీసులు అతడి ఇంట్లో తనిఖీలు చేసి ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పురావస్తు శాఖ ఉన్నతాధికారి ముష్తాక్ అహ్మద్‌కు పోలీసులు ఈ దుర్గామాత విగ్రహాన్ని అప్పగించారు. స్థానిక పురావస్తు అధికారులు ఇది 7 లేదా 8వ శతాబ్ధంలో చెక్కిన దుర్గామాత విగ్రహంగా నిర్ధారించారు, అంటే సుమారు 1200 సంవత్సరాల క్రితం విగ్రహంగా తేల్చారు. దీనికి సంబంధించి పోలీసులకు నివేదిక అందించారు. అత్యంత పురాతన దుర్గామాత విగ్రహం జమ్ముకశ్మీర్‌లో లభించడం స్థానిక మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
తాము స్వాధీనం చేసుకున్న దుర్గామాత విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగిస్తున్న పోలీసులు..
Also Read..
హుజూరాబాద్ ఉప ఎన్నికపై మారిన కాంగ్రెస్ వ్యుహం.. అభ్యర్థి ఎంపిక కోసం ఇంటర్వ్యూ!
కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్‌లో 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..