Crime News: పెళ్లి జరిగిన పది మాసాలకే మహిళ ఆత్మహత్య.. వీడియో కాల్‌లో భర్త చూస్తుండగానే..

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Sep 01, 2021 | 11:33 AM

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక క్షేత్ర హోమ్స్ అపార్ట్మెంట్‌లోని రెండో ఫ్లోర్‌లో

Crime News: పెళ్లి జరిగిన పది మాసాలకే మహిళ ఆత్మహత్య.. వీడియో కాల్‌లో భర్త చూస్తుండగానే..
Woman Suicide 2

Hyderabad – wife suicide: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భర్తపై ఉన్న కోపంతో ఒక ఇల్లాలు తీవ్ర నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..  స్థానిక క్షేత్ర హోమ్స్ అపార్ట్మెంట్‌లోని రెండో ఫ్లోర్‌లో ఉన్న 203 ఫ్లాట్లో నాగదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, భర్తతో గొడవపడి..  భార్య నాగదేవి తన భర్తకి వీడియో కాల్ చేసి లైవ్ చూపిస్తూ ఆత్మహత్య చేసుకుంది. కాగా,  భార్యాభర్తలకు వివాహం జరిగి పది నెలలు అవుతుందని తెలుస్తోంది. వీరికి వివాహం జరిగినప్పటి నుంచి నాగదేవి భర్త సాయి శివ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ విధులు నిర్వహిస్తున్నారు.

ఉద్యోగరిత్యా బెంగళూరులో ఉంటున్న భర్త సాయి శివ వారానికి రెండు రోజులు మాత్రమే హైదరాబాద్ లోని ఇంటికి వచ్చి భార్యను కలుస్తూ ఉండేవాడని స్థానికులు తెలుపుతున్నారు. భార్య నాగదేవి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. అయితే, భార్యాభర్తల మధ్య ఉదయం ఫోన్ లో వాగ్వాదం జరిగినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

తన భర్త సాయి శివ తనను సరిగ్గా చూసుకోవడం లేదని నాగదేవి ఇప్పటికే పలుమార్లు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిందని సమాచారం. నిన్న తీవ్ర స్థాయిలో దంపతుల మధ్య పోన్ లో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగే సరికి భర్తకు వీడియో కాల్ చేసి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు అంటున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Woman Suicide

Read also: Pension Rules: ఏ నెల పింఛను ఆ నెలలోనే..! తీసుకోకపోతే ఆ నెల డబ్బులు మురిగిపోయినట్లే.. సర్కారు కొత్త రూల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu