Telangana Governor: టీచర్‌గా మారిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ప్రతీ క్లాస్ రూం తిరిగి ఏం పాఠాలు చెప్పారంటే..
తెలంగాణ గవర్నర్ తమిళిసై కొద్దిసేపు టీచర్ గా మారిపోయారు. రాజ్ భవన్ స్కూల్ లో ఏర్పాట్లను పరిశీలించిన తమిళిసై... పిల్లలకు
Telangana Governor Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై కొద్దిసేపు టీచర్ గా మారిపోయారు. రాజ్ భవన్ స్కూల్ లో ఏర్పాట్లను పరిశీలించిన తమిళిసై.. పిల్లలకు, సిబ్బందికి కొవిడ్ పాఠాలు చెప్పారు. ప్రతి క్లాస్ రూమ్ తిరుగుతూ పిల్లలకు అవేర్ నెస్ కల్పించారు. ఏవిధంగా మాస్క్ ధరించాలి? ఎలా శానిటైజ్ చేసుకోవాలి? భౌతిక దూరం ఎలా పాటించాలి? ఇలా ప్రతి చిన్న విషయాన్నీ పిల్లలకు వివరించారు. పిల్లలకు అర్ధమయ్యేలా చేతులతో యాక్షన్ చేసి మరీ వివరించారు.
స్టూడెంట్స్ కు మాస్కులు అందజేసి గవర్నర్ జాగ్రత్తలు చెప్పారు. క్లాస్ రూమ్, ప్లే గ్రౌండ్, వాష్ రూమ్.. ఎక్కడైనా సరే కచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్నారు. టీచర్లు, స్కూల్ సిబ్బందికి కూడా కరోనా జాగ్రత్తలు వివరించారు. స్కూల్స్ రీఓపెన్ తో పిల్లల్లో సంతోషం కనిపిస్తోందన్నారు గవర్నర్ తమిళిసై. పిల్లలు తమ ఆనందాన్ని లౌడ్ వాయిస్ తో తెలియజేశారని తెలిపారు.
రాజ్ భవన్ స్కూల్ లో ప్రతి క్లాస్ రూమ్ తిరిగాను.. ఏర్పాట్లు బాగున్నాయ్ అంటూ సిబ్బందిని గవర్నర్ తమిళసై అభినందించారు. పిల్లలను ధైర్యంగా స్కూళ్లకు పంపిన తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లు తెలిపిన గవర్నర్ తమిళిసై.. ఇక జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు. నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభమవుతుండడంతో రాష్ట్ర గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
విద్యార్థులకు గవర్నర్ స్వయంగా మాస్కులు అందజేసి పలు జాగ్రత్తలు సూచించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇన్నాళ్లు పిల్లల్ని కాపాడిన తల్లిదండ్రులను అభినందించారు. ఇవే జాగ్రత్తలు భవిష్యత్తులో నూ తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మాస్కులు ధరించి ప్రికాషన్స్ తీసుకుంటూ స్కూల్‌కు వచ్చిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారని ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై వ్యాఖ్యానించారు.