అంపైర్ నిర్ణయంపై అంతా షాక్.. ఆగ్రహం వ్యక్తం చేసిన వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్.. అసలేం జరిగిందంటే?
ప్రస్తుత కాలంలో ప్రమాదకరమైన టీ 20 ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్ పేరు కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. బ్యాట్, బాల్ రెండింటితోనూ ఎలాంటి మ్యాచ్‌నైనా మర్చేయగల సత్తా ఉంది.
CPL: ప్రస్తుతం టీ20 లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్లలో కీరన్ పొలార్డ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ బ్యాట్స్‌మన్ తన వేగవంతమైన బ్యాటింగ్‌తో బౌలర్లను చీల్చి చెండాడుతుంటాడు. ఐపీఎల్ నుంచి ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల వరకు, పొలార్డ్ ప్రదర్శన కనిపిస్తూనే ఉంది. అతను ప్రస్తుతం తన దేశం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. బౌలర్లను బాదే బ్యాట్స్‌మన్‌గానే కాకుండా, బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టే గొప్ప బౌలర్‌గా కూడా పేరుగాంచాడు. సీపీఎల్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తూనే ఉన్నాడు. అయితే, ఈసారి ఓ వివాదం కారణంగా పోలార్డ్ వార్తల్లోనిలిచాడు.
సీపీఎల్‌లో ట్రినిబాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, అంపైర్ నిర్ణయంతో పొలార్డ్ సంతోషంగా లేడు. దీంతో ఆగ్రహించిన పోలార్డ్.. తన నిరసనను అంపైర్‌పై చూపించాడు. పొలార్డ్ సీపీఎల్‌లో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ చేయగా, కింగ్స్‌కు చెందిన వహబ్ రియాజ్ 19 వ ఓవర్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. టిమ్ సీఫెర్ట్ క్రీజులో ఉన్నాడు. రియాజ్ ఆఫ్-స్టంప్ వెలుపల బంతిని బౌల్ చేశాడు. ఈ బాల్‌ను సీఫెర్ట్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో సీఫర్ట్ పక్కకు పడిపోయాడు. కానీ, అంపైర్ ఈ బంతిని వైడ్‌గా ప్రకటించలేదు. సీఫెర్ట్, పొలార్డ్ కూడా అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఫర్ట్ అంపైర్‌తో ఏదో మాట్లాడుతున్నాడు. కానీ, పొలార్డ్ కేవలం అంపైర్ వైపు చూస్తూ.. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉండి సైగలు చేశాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో, పొలార్డ్ సారథ్యంలోని నైట్ రైడర్స్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. పొలార్డ్ 29 బంతుల్లో 41 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సీఫెర్ట్ 25 బంతులను ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లను బాదేశాడు. అనంతరం కింగ్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆండ్రీ ఫ్లెచర్ 55 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో అజేయంగా 81 పరుగులు చేశాడు. కానీ, ఇతర బ్యాట్స్‌మన్‌లు రాణించకపోవడంతో టీం ఓడిపోయింది. నైట్ రైడర్స్ తరపున రవి రాంపాల్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Just Kieron Pollard things ?#CPL21 #KieronPollard #TKRvSLK #Pollard pic.twitter.com/PtY16EMAmN
— Satyam Shekhar (@satyamshekhar_) August 31, 2021
Also Read: IND vs ENG: నాల్గవ టెస్టులో టీమిండియా ఓటమి ఖాయమా..! 50 ఏళ్లుగా ఓవల్‌లో భారత్‌కు నిరాశే.. కోహ్లీ ఏం చేయనున్నాడు?