AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: నాల్గవ టెస్టులో టీమిండియా ఓటమి ఖాయమా..! 50 ఏళ్లుగా ఓవల్‌లో భారత్‌కు నిరాశే.. కోహ్లీ ఏం చేయనున్నాడు?

IND vs ENG: మూడో టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి తర్వాత, సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధంగా ఉంది. నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఫాంలోకి రావడంతో.. ఆటీం బలం మరితంగా పెరిగింది.

IND vs ENG: నాల్గవ టెస్టులో టీమిండియా ఓటమి ఖాయమా..! 50 ఏళ్లుగా ఓవల్‌లో భారత్‌కు నిరాశే.. కోహ్లీ ఏం చేయనున్నాడు?
Virat Kohli Test England
Venkata Chari
|

Updated on: Sep 01, 2021 | 9:57 AM

Share

IND vs ENG: నాలుగో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా నిలాచాయి. దీంతో నాల్గవ టెస్ట్‌లో గెలచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఇరుజట్లు ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ, విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు ఈ మైదానంలో విజయం చాలా కష్టంగా తయారైంది. గత 50 ఏళ్లలో టీమిండియా ఓవల్‌లో గెలవలేకపోయిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ చివరిసారిగా 1971 లో భారత్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఈ కోణంలో, ఓవల్‌లో గెలవడానికి భారతదేశం పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలి. ఏదేమైనా, మూడో టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి తరువాత, ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమైంది. నాలుగో టెస్టుకు ముందు ఇంగ్లండ్ టీం స్టార్ ఆటగాళ్లు ఫాంలోకి రావడంతో.. ఆటీం బలం కూడా పెరిగింది.

ఓవల్‌లో 13 టెస్టులు ఆడింది.. ది ఓవల్‌లో భారత జట్టు ఇప్పటివరకు 13 టెస్టులు ఆడింది. ఒక్కటి మాత్రమే అక్కడ గెలిచింది. ఈ విజయం 1971 లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో వచ్చింది. అప్పుడు భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంలో హీరో భగవత్ చంద్రశేఖర్, రెండో ఇన్నింగ్స్‌లో అతను ఆరు వికెట్లతో చెలరేగడంతో విజయం సాధ్యమైంది. టీమిండియా విజయానికి 173 పరుగుల లక్ష్యాన్ని సాధించి, లక్ష్యం చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు, తరువాత టీమిండియా అక్కడ గెలవలేదు. ఓవల్‌లో, భారతదేశం 13 టెస్టుల్లో ఐదింట్లో ఓడింది. ఏడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఈ మైదానంలో ఆడిన గత మూడు టెస్టుల్లో భారత్ ఓడిపోవడం మరితం బాధాకరం. వీటిలో రెండింటిలోనూ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చెందడం గమనార్హం.

ఓవల్‌లో టీమిండియా పరిస్థితి.. 1936 లో ఓవల్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. తర్వాత 1946, 1952 లో ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ డ్రాగా ముగిసింది. 1959 లో, ఇక్కడ రెండు జట్లు తలపడ్డాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 27 పరుగుల తేడాతో గెలిచింది. దీని తర్వాత 1971 లో భారత్ గెలిచింది. 1979, 1982, 1990, 2002, 2007 లో రెండు జట్లు ఇక్కడ ఆడిన టెస్ట్‌లను డ్రా చేసుకున్నాయి. కానీ, 2011, 2014, 2018 లో భారత్ ఓడిపోయింది. చివరిసారిగా భారత్-ఇంగ్లండ్ టీంలు ఓవల్‌లో ఆడినప్పుడు.. టీమిండియా 118 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టెస్టులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీలు సాధించారు. అయినా భారత్ విజయానికి దూరంగానే నిలిచింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఓవల్‌లో ఎలా ఆడుతుందో చూడాలి.

Also Read:

Joe Root vs Virat Kohli: ‘సిరీస్‌ గెలవాలంటే విరాట్ కోహ్లీ మౌనంగా ఉండాలి’: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

బ్రాడ్‌మన్‌కే చుక్కలు చూపించిన స్పిన్నర్.. 9 పరుగులకే 7 వికెట్లు.. కేవలం 38 ఏళ్లకే జైలులో మరణించాడు.. ఎందుకో తెలుసా?

IPL 2021: రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద దెబ్బ.. దూరమైన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు.. కొత్తగా ఎవరొచ్చారంటే..!