AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రాడ్‌మన్‌కే చుక్కలు చూపించిన స్పిన్నర్.. 9 పరుగులకే 7 వికెట్లు.. కేవలం 38 ఏళ్లకే జైలులో మరణించాడు.. ఎందుకో తెలుసా?

లెజెండరీ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్‌ను ఎనిమిది సార్లు హాడ్లీ వెరిటీ అవుట్ చేశాడు. బ్రాడ్‌మన్‌ని అతని కంటే ఎక్కువసార్లు ఏ బౌలర్ కూడా అవుట్ చేయలేడు.

బ్రాడ్‌మన్‌కే చుక్కలు చూపించిన స్పిన్నర్.. 9 పరుగులకే 7 వికెట్లు.. కేవలం 38 ఏళ్లకే జైలులో మరణించాడు.. ఎందుకో తెలుసా?
Hedley Verity
Venkata Chari
|

Updated on: Sep 01, 2021 | 9:07 AM

Share

1939లో రెండవ ప్రపంచ యుద్ధ ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా పొంచి ఉంది. యూరప్ దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. హిట్లర్ నాయకత్వంలోని జర్మనీ దేశం ఒక పెద్ద శక్తిగా మారింది. అది అనేక దేశాలకు ముప్పుగా మారింది. జర్మనీ యుద్ధ ఉన్మాదంతో ఇంగ్లండ్ కూడా తప్పించుకోలేకపోయింది. ఈ ప్రభావం క్రీడలపై కూడా పడింది. ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అలాంటి వాతావరణమే ఏర్పడింది. దాదాపు అన్ని మ్యాచ్‌లు రద్దు చేశారు. కానీ, యార్క్ షైర్, సస్సెక్స్ జట్లు మాత్రం మ్యాచులు ఆడాలని నిర్ణయించుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గ్రేట్ స్పిన్నర్ హెడ్లీ వెరిటీ చివరి మ్యాచ్‌గా మారింది. అలాగే, ఆ ​​సంవత్సరం ఇంగ్లండ్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా ఇది చివరి రోజుగా మారింది. ఈ మ్యాచ్ పూర్తయిన రెండు రోజుల తర్వాత, ఇంగ్లండ్ యుద్ధం ప్రకటించింది. హెడ్లీ వెరిటీ కేవలం తొమ్మిది పరుగులకే ఏడు వికెట్లు తీశాడు. దీంతో యార్క్‌షైర్ జట్టు కౌంటీ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో, వెరిటీ 13 పరుగులు చేశాడు.

ససెక్స్‌పై అద్భుత విజయం.. సెప్టెంబర్ 1, 1939లో స్పిన్నర్ హెడ్లీ వెరిటీ కి క్రికెట్ కెరీర్‌లో చివరి రోజు. 1939 లో అదే రోజున యార్క్ షైర్ ససెక్స్ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో సస్సెక్స్ తొలుత బ్యాటింగ్ చేసి 387 పరుగులు చేసింది. అనంతరం యార్క్‌షైర్ మొదటి ఇన్నింగ్స్‌లో 392 పరుగులు చేసింది. కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో వెరిటీ ససెక్స్‌ని చావు దెబ్బ తీశాడు. ఆరు ఓవర్లలో ఒక మెయిడిన్‌తో తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి, ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. దీని కారణంగా, ససెక్స్ జట్టు 33 పరుగులకే ఆలౌట్ అయింది. యార్క్‌షైర్ 29 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ నష్టపోయి సాధించింది.

మ్యాచ్ తరువాత యుద్ధం.. మ్యాచ్ తర్వాత యుద్ధం మొదలైంది. హెడ్లీ వెరిటీ కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. అతను బ్రిటిష్ ఆర్మీకి చెందిన B కంపెనీ కమాండెంట్‌గా పనిచేస్తున్నాడు. యుద్ధంలో గాయపడిన తర్వాత అతను జర్మన్ సైనికులకు దొరికిపోయాడు. 19 జులై 1943 న హెడ్లీ ఇటలీలో యుద్ధ ఖైదీగా మరణించాడు. వెరిటీకి అప్పుడు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే.

బ్రాడ్‌మన్‌నే భయపెట్టాడు.. గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన డాన్ బ్రాడ్‌మన్ ఎనిమిది సార్లు హెడ్లీ వెరైటీ చేతిలో ఔట్ అయ్యాడు. బ్రాడ్‌మన్‌ని అతని కంటే ఎక్కువసార్లు ఏ బౌలర్ కూడా పెవిలియన్‌ చేర్చలేదు. హెడ్లీ వెరిటీ ఇంగ్లండ్ తరపున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 144 వికెట్లు తీసుకున్నాడు. ఈ సమయంలో, ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 43 పరుగులకు ఎనిమిది వికెట్లుగా నిలిచింది. మ్యాచ్‌లో 104 పరుగులకు 15 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 20.90 సగటుతో మూడు అర్ధ సెంచరీల సహాయంతో 669 పరుగులు చేశాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌.. హెడ్లీ వెరైటీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌ని పరిశీలిస్తే.. 378 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 1956 వికెట్లు తీసుకున్నాడు. ఇన్నింగ్స్‌లో 10 పరుగులకు 10 వికెట్ల ఫీట్ కూడా అతని పేరుతో ఉంది. అతను ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 1 సెంచరీ, 13 అర్ధ సెంచరీలు చేశాడు. 18.07 సగటుతో 5603 పరుగులు నమోదు చేశాడు.

Also Read:

IPL 2021: రాజస్థాన్ రాయల్స్‌కు పెద్ద దెబ్బ.. దూరమైన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు.. కొత్తగా ఎవరొచ్చారంటే..!

Pakistan Cricket Board: పీసీబీ చీఫ్‌‌గా ఆ మాజీ దిగ్గజం..? ఆసక్తి లేదంటూ ట్వీట్..!

Pro Kabaddi League: పీకేఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ప్రదీప్ నర్వాల్.. యూపీ యోధ ఎంతకు దక్కించుకుందో తెలిస్తే షాకే..!