Pro Kabaddi League: పీకేఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ప్రదీప్ నర్వాల్.. యూపీ యోధ ఎంతకు దక్కించుకుందో తెలిస్తే షాకే..!
Pradeep Narwal: మంగళవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో పర్దీప్ నర్వాల్‌ని 1.65 కోట్లకు యూపీ యోధా కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
Pradeep Narwal: మంగళవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో పర్దీప్ నర్వాల్‌ని 1.65 కోట్లకు యూపీ యోధా కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ‘యూపీ యోధ’ డిసెంబర్‌లో జరగబోయే రాబోయే సీజన్ 8 కోసం పీకేఎల్ వేలంలో భాగంగా రెండవ రోజున నర్వాల్‌ను కొనుగోలు చేసింది. పర్దీప్ గత కొంతకాలంగా పలు రికార్డులకు కేరాఫ్‌గా నిలిచాడు. సీజన్ 6 లో ‘హర్యానా స్టీలర్స్’ రూ .1.51 కోట్లకు కొనుగోలు చేసినట్లు పీకేఎల్ సోమవారం మీడియా ప్రకటనలో పేర్కొంది. ‘పాట్నా పైరేట్స్’ తో ఐదు సీజన్లు గడిపిన తర్వాత.. నర్వాల్ ఈ ఏడాది యూపీ యోధ తరపున బరిలోకి దిగనున్నాడు. సిద్ధార్థ్ దేశాయ్‌ని ‘తెలుగు టైటాన్స్’ ఫైనల్ బిడ్ మ్యాచ్ (FBM) కార్డ్‌లో తన ప్రాథమిక ధర రూ. 30 లక్షల నుంచి రూ .1.30 కోట్లకు చేరుకున్నాడు.
రెండో రోజు 22 మందికి పైగా విదేశీ ఆటగాళ్లు వేలంలో నిలిచారు. ఆల్ రౌండర్ మొహమ్మద్రేజా షాద్లౌయి చియానే (బేస్ ప్రైస్ రూ. 10 లక్షలు), ‘పాట్నా పైరేట్స్’కు రూ .31 లక్షలకు దక్కించుకుంది. ‘బెంగాల్ వారియర్స్’ డిఫెండర్ అబోజార్ మొహజెర్మిగానిని రూ. 30.5 లక్షలకు కొనుగోలు చేసింది. ‘పాట్నా పైరేట్స్’ దక్షిణ కొరియా రైడర్ జాంగ్ కున్ లీని రూ. 20.5 లక్షలకు దక్కించుకుంది. ‘తెలుగు టైటాన్స్’ తో ఆరు సీజన్లు, ‘తమిళ్ తలైవాస్’ తో ఒక సీజన్ ఆడిన తర్వాత, రాహుల్ చౌదరి ఇప్పుడు ‘పునేరి పల్టాన్స్’ తరపున బరిలోకి దిగనున్నాడు.
కెప్టెన్ దీపక్ నివాస్ హుడా, సందీప్ కుమార్ ధుల్‌లను దక్కించుకోవడానకి ‘జైపూర్ పింక్ పాంథర్స్’ FBM కార్డులను ఉపయోగించింది. ‘తమిళ్ తలైవాస్’ రైడర్ మంజీత్ కోసం అతని ప్రాథమిక ధరకు మూడు రెట్లకు అంటే రూ .92 లక్షలకు కొనుగోలు చేసింది.
మరోవైపు ఆల్-రౌండర్ రోహిత్ గులియా ‘హర్యానా స్టీలర్స్’ రూ .83 లక్షలకు కొనుగోలు చేసింది. సీజన్ 7 లో ‘గుజరాత్ జెయింట్స్’ అతనిని రూ. 25-లక్షల ధరకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆయన ధర అమాంతం పెరగడం విశేషం.
టాప్ 5 భారత ఆటగాళ్లు: పర్దీప్ నర్వాల్ రూ .1.65 కోట్లు – యూపీ యోధ సిద్ధార్థ్ దేశాయ్ రూ .1.30 కోట్లు – తెలుగు టైటాన్స్ మంజీత్ రూ .92 లక్షలు – తమిళ తలైవాస్ సచిన్ రూ .84 లక్షలు – పాట్నా పైరేట్స్ రోహిత్ గులియా రూ .83 లక్షలు – హర్యానా స్టీలర్స్.
Also Read:
Tokyo Paralympics: రజతం గెలిచిన మరియప్పన్ తంగవేలు, హైజంప్‌లో శరద్ కుమార్ కు కాంస్యం..!