Tokyo Paralympics: రజతం గెలిచిన మరియప్పన్ తంగవేలు, హైజంప్‌లో శరద్ కుమార్ కు కాంస్యం..!
2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. దీంతో ఇప్పటి వరకు భారతదేశానికి 10 పతకాలు వచ్చినట్లైంది.
Tokyo Paralympics: తంగవేలు 2016 రియో పారాలింపిక్స్‌లో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు టోక్యోలో టీ-42 స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. తంగవేలు రియో పారాలింపిక్స్ టీ-42 హైజంప్‌లో 1.89 మీటర్లు దూకి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారతదేశానికి మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. దీంతో ఇప్పటి వరకు భారతదేశానికి 10 పతకాలు వచ్చినట్లైంది. పారా హై-జంపర్ మరియప్పన్ తంగవేలు మంగళవారం రజత పతకం సాధించాడు. శరద్, మరియప్పన్ ఇద్దరూ తమ మొదటి ప్రయత్నాలలో 1.73 మీ, 1.77 మీలు మాత్రమే దూకగలిగారు. అలాగే వరుణ్ భాటి కూడా 1.80 మీటర్ల మార్కును దాటలేకపోయాడు.
శరద్, మరియప్పన్ మొదటి ప్రయత్నాలలో 1.80 మీ, 1.83 మీ. దూకాడు. అలాగే 1.86 మార్కును మూడో ప్రయత్నంలో జయించాడు. 1.86 మీటర్ల మార్కును అధిగమించడంలో విఫలమైన తర్వాత శరద్ మూడో స్థానంలో నిలిచాడు. 2016 రియో గేమ్స్‌లో కాంస్యం సాధించిన వరుణ్.. 1.80 మీటర్ల మార్కును అధిగమించడంలో మాత్రం విఫలం అయ్యాడు. దీంతో పతకం రేసు నుంచి తప్పుకున్నాడు.
తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన తంగవేలు, ఐదేళ్ల వయసులో ఒక బస్సు యాక్సిడెంట్‌లో మోకాలికింద అతని కుడి కాలు బాగా దెబ్బతింది. దీంతో శాశ్వత వైకల్యానికి గురయ్యాడు. అనంతరం కుటుంబాన్ని పోషించేందుకు వార్తాపత్రిక హాకర్‌గా పని చేయాల్సి వచ్చింది. 25 ఏళ్ల తంగవేలుకు గత ఏడాది దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న కూడా లభించింది.
It’s ?for Mariyappan!!
Mariyappan Thangavelu wins silver medal at #Tokyo2020 #Paralympics!!!
Phenomenal effort by Mariyappan to win his 2nd consecutive #Paralympics medal ??
?? is proud of you!#Cheer4India #Praise4Para @189thangavelu pic.twitter.com/rEyA2NDVFi
— SAI Media (@Media_SAI) August 31, 2021