Pakistan Cricket Board: పీసీబీ చీఫ్‌గా ఆ మాజీ దిగ్గజం..? ఆసక్తి లేదంటూ ట్వీట్..!
ఆస్ట్రేలియాలో ఉన్న పాకిస్తాన్ మాజీ దిగ్గజం వసీ అక్రమ్.. పీసీబీ ఛైర్మన్ ఉద్యోగం ప్రత్యేకమైనదంటూనే దానికి నేను సిద్ధంగా లేనంటూ ట్వీట్ చేశాడు.
Pakistan Cricket Board: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ కావడానికి ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న అక్రమ్, పీసీబీ ఛైర్మన్ ఉద్యోగం ప్రత్యేకమైనదంటూనే, దానికి తాను సిద్ధంగా లేనని ట్వీట్ చేశాడు. అయితే, లెజెండరీ పేసర్‌ను పీసీబీ బోర్డు అధ్యక్షుడిగా, ఆదేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ స్థానాన్ని ఆఫర్ చేస్తారో లేదో నిర్ధారించలేదు.
పీసీబీ చీఫ్‌గా మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా పోటీపడుతున్నాడు. ఈమేరకు నామినేషన్ కూడా వేసినట్లు వార్తలు వినిపించాయి. అక్రమ్ కూడా ఆ పదవికి ప్రధాన పోటీదారుగా పాకిస్తాన్‌లో వార్తలు వెలువడుతున్నట్లు పేర్కొన్నారు. రమీజ్‌ను పీసీబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు ప్రధానమంత్రి నామినేట్ చేశారు. సెప్టెంబర్ 13 న మూడు సంవత్సరాల కాలానికి పీసీబీ కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకుంటుంది.
పీసీబీ క్రికెట్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న వసీ అక్రం.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్ డైరెక్టర్ క్రికెట్/కోచ్‌గా ఉన్నాడు. అక్రమ్ ప్రస్తుతం తన భార్య, కుమార్తెతో ఆస్ట్రేలియాలో ఉన్నారు.
Dale Steyn: అతడు బంతి విసిరితే బ్యాట్స్‌మెన్‌కి దడే..! క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఫాస్ట్ బౌలర్..