20 ఓవర్ల మ్యాచ్.. 14 బంతుల్లో ఫలితం.. చెత్త రికార్డులు ఆ జట్టు సొంతం!
సాధారణంగా 20 ఓవర్ల మ్యాచ్ అభిమానులకు కావల్సినంత మజాను ఇస్తుంది. సిక్సర్లు, ఫోర్ల వర్షంతో బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది..
సాధారణంగా 20 ఓవర్ల మ్యాచ్ అంటేనే రసవత్తరంగా ఉంటుంది. ఫోర్లు, సిక్సర్ల హోరు.. వికెట్ల మోత ఉంటుంది. అయితే ఇక్కడ కాస్త సీన్ రివర్స్ అయింది. క్రికెట్ చరిత్రలో అదొక అత్యల్ప స్కోర్. 17.4 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే.. ఇన్నింగ్స్ మొత్తంలో ఓ ఫోర్ మాత్రం నమోదైంది. ఆ జట్టు కేవలం 24 పరుగుల అత్యల్ప స్కోర్ సాధించగలిగింది. ఇక ప్రత్యర్ధి జట్టు ఆ టార్గెట్‌ను 14 బంతుల్లో మూడు వికెట్లు నష్టపోయి చేధించింది. అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ ఎప్పుడు జరిగింది.? ఏయే టీమ్స్ మధ్య జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్రాన్స్ విమెన్స్ టీమ్ వరుసగా నాలుగో ఓటమిని నమోదు చేసుకుంది. స్కాట్‌ల్యాండ్ విమెన్స్ టీంతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆ జట్టుకు ఇది నాలుగో అత్యల్ప స్కోర్. ఐరోపా రీజియన్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో ఫ్రాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ సాధించిన అత్యధిక స్కోరు జర్మనీపై 45 పరుగులు మాత్రమే. ఈ టోర్నమెంట్‌లో మొత్తంగా ఫ్రాన్స్ జట్టు.. 24, 33, 45 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ 11 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జెన్నిఫర్ కింగ్ ఎనిమిది పరుగులకు పెవిలియన్ చేరింది. ఈమె జట్టులో అత్యధిక స్కోరర్. మిగిలిన వారంతా క్రీజులోకి.. అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ విమెన్స్ జట్టు పేలవ ప్రదర్శనను కనబరిచింది. స్కాటిష్ బౌలర్లలో మేగాన్ మెక్‌కాల్ 3 పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది. టీ20ల్లో ఐదు వికెట్లు తీసిన మొదటి స్కాటిష్ మహిళగా మేగాన్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక 24 పరుగుల లక్ష్యచేధనను స్కాట్లాండ్ విమెన్స్ టీం 2.2 ఓవర్లలో అంటే 14 బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది.
ఇవి చదవండి: