Viral Video: సీలింగ్‌పై వేలాడుతున్న జుట్టు.. భయపడుతూనే ఏంటని చూడగా ఫ్యూజులు ఔట్!

ఆ దంపతులు ఇద్దరూ తమ పని ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుని సోఫాలో కూర్చోగా.. వారికి సీలింగ్‌పైన..

Viral Video: సీలింగ్‌పై వేలాడుతున్న జుట్టు.. భయపడుతూనే ఏంటని చూడగా ఫ్యూజులు ఔట్!
Ceiling
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 04, 2021 | 8:33 PM

ఆ దంపతులు ఇద్దరూ తమ పని ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుని సోఫాలో కూర్చోగా.. వారికి సీలింగ్‌పైన వేలాడుతున్న జుట్టు దర్శనమిచ్చింది. ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయ్యారు. అది ఏమై ఉంటుందా.? అని ఇద్దరూ కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుని అక్కడ ఏముందో చూడటానికి పై అంతస్తుకు చేరుకున్నారు. ఇక అక్కడ వారికి అసలేం కనిపించింది.? ఆ కథేంటన్నది ఇప్పుడు చూద్దాం..

సౌత్ వెస్ట్ చైనా గుయిజౌ ప్రావిన్స్‌లోని పుడింగ్ కౌంటీలో నివసిస్తున్న ఓ చిన్నారి.. ఆట ఆడుకుంటూ పైఅంతస్తులో ఉన్న చిన్న రంధ్రంలోకి తన తలను దూర్చుతుంది. ఇక బయటికి తీయాలని ట్రై చేయగా.. అది కాస్తా అందులో ఇరుక్కుపోతుంది. తద్వారా అప్పుడే ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఆ చిన్నారి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇస్తుంది. ఆ రంధ్రాన్ని ఫ్యాన్ పెట్టేందుకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ అమ్మాయి తలను అందులో నుంచి తీసేందుకు పేరెంట్స్ శతవిధాల ప్రయత్నించారు. ఆ రంధ్రంలో నుంచి తీస్తున్న ప్రతీసారి చిన్నారి నొప్పితో విలవిలలాడిపోయేది.

దీనితో తమ కూతురు తలను బయటికి తీసేందుకు ఆ తల్లిదండ్రులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తలక్రిందులుగా ఆ అమ్మాయి రంధ్రంలో ఇరుక్కుపోయినట్లు గుర్తించిన సిబ్బంది.. 40 నిమిషాల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ చేసి ఆ అమ్మాయి అతి జాగ్రత్తగా బయటికి తీశారు. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దాన్ని చూస్తే ఓ హారర్ సినిమాలా అనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..