మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. పేరేమో సూపర్.. సోషల్ మీడియాలో వైరల్!

విశాఖ జిల్లాలో మత్స్యకారులకు ఓ ఏంజెల్‌ దొరికింది. అవును మీరు విన్నది నిజమే.. చేపల వలకు ఏంజెల్‌ దొరకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?

మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. పేరేమో సూపర్.. సోషల్ మీడియాలో వైరల్!
Fish

విశాఖ జిల్లాలో మత్స్యకారులకు ఓ ఏంజెల్‌ దొరికింది. అవును మీరు విన్నది నిజమే.. చేపల వలకు ఏంజెల్‌ దొరకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే ఈ స్టోరీని చదవండి.. మీకో క్లారిటీ వస్తుంది. చేప శాస్త్రీయ నామం పోమాకాట్స్. ఇక ఏంజెల్‌ అనేది ఓ అరుదైన చేప పేరు. సముద్రంలోని అందమైన చేపల్లో ఇదొక రకం అన్నమాట.

ఆకట్టుకునే రంగు, రూపం దీని సొంతం. ఇది సముద్రంలోని పగడపు దిబ్బల్లో ఉంటుందట. ఇటువంటి చేపలు ఏడాదికి ఒక్కటైనా చిక్కడం కష్టమేనన్నది మత్స్యకారుల మాట. అయిదు కిలోల బరువు వరకు ఉంటుందని అంటున్నారు. పగడపు దిబ్బల్లో ఈ చేప చిక్కడం మత్స్యకారులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇలాంటి చేపలను ఎక్కువగా ఇళ్లలోని అక్వేరియంలో పెంచికుంటూ ఉంటారు. ఈ చేపలు చిలుక ముక్కు ఆకారంలో, ఓ పన్నుతో కాస్త చూసేందుకు భయంకరంగా ఉంటాయి.

ఇవి చదవండి:

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu