Minister Buggana: టీడీపీ తీరుతో మొత్తం రాష్ట్రానికే నష్టం.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు

Minister Buggana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భం గా మంత్రి బుగ్గన ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపుపై..

Minister Buggana: టీడీపీ తీరుతో మొత్తం రాష్ట్రానికే నష్టం.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు
Buggna
Follow us
Surya Kala

|

Updated on: Aug 31, 2021 | 4:37 PM

Minister Buggana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భం గా మంత్రి బుగ్గన ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. అన్ రాక్ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించినట్లు చెప్పారు.  ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక ఈ కేసు న్యాయపరంగా పరిష్కారమైతే ఒక పెద్ద కంపెనీ రాష్ట్రానికి వస్తుందన్నారు.  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థల ఏర్పాటు గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే వీటిని  నెలకొల్పేందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలైనన్ని ఉండాలన్నది సీఎం జగన్ ఉద్దేశమని తెలిపారు బుగ్గన.

ఆంధ్ర ప్రదేశ్ అప్పుల పాలై పోయిందంటూ.. టీడీపీ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడడం కోసం అప్పులు తీసుకొచ్చామని.. టిడిపి తన రాజకీయ లబ్ధికోసమే చూస్తుంది తప్ప.. ప్రజల కోసం ఆలోచించడం లేదని తెలిపారు. టీడీపీ పాలన సమయంలో కరోనా లేదని.. అయినప్పటికీ వారు అప్పులు చేశారని.. అయితే ఇప్పుడు కరోనా వచ్చి.. ఆదాయం పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి అప్పుల చేయడం తప్పడం లేదని బుగ్గన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బతీసేలా టిడిపి ప్రవర్తిస్తోందని …. టిడిపి ప్రవర్తన కారణంగా మొత్తం రాష్ట్రానికే నష్టం కలుగుతోందని ఏపీ ఆర్ధిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : రేపు తెలంగాణలో స్కూల్స్ నిర్వహణపై కొనసాగుతున్న సస్పెన్స్.. సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం