AP Weather Alert: ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు..! ఆ 3 జిల్లాలకు హెచ్చరికలు..
AP Weather Alert: నిన్నటి అల్పపీడనం విదర్భ, పశ్చిమ ప్రాంతాలలో బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 km ఎత్తు వరకు
AP Weather Alert: నిన్నటి అల్పపీడనం విదర్భ, పశ్చిమ ప్రాంతాలలో బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 km ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపునకు కొనసాగుతోంది. ఈరోజు తూర్పు-పడమర ‘షీర్ జోన్'(ద్రోణి) 15°N అక్షాంశము వెంబడి సగటు సముద్ర మట్టానికి 5.8 km నుంచి 7.6 km ఎత్తుల మధ్య స్థిరంగా కొనసాగుతున్నది. వీటి ప్రభావం వల్ల రాగల మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాం : ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.