Y.S Vijayamma: వైఎస్ విజయమ్మ ఆహ్వానంపై ఎలా స్పందించాలి..? అయోమయంలో టీ కాంగ్రెస్ నేతలు..
Y.S Vijayamma: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన లేఖలు.. పంపుతున్న
Y.S Vijayamma: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన లేఖలు.. పంపుతున్న వర్తమానాలకు ఎలా స్పందించాలనేది కాంగ్రెస్ నేతలకు అంతుచిక్కడం లేదు. సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో నిర్వహించనున్న వైఎస్సార్ సంస్మరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ సమాచారం ఇచ్చారు. విజయమ్మ పిలుపు మేరకు హాజరవుతారా లేదా అనేది తెలియడం లేదు.
దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి 12 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ చనిపోయిన సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లోని నొవాటెల్ హోటల్ లో ప్రత్యేక సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌తో పొలిటికల్‌గా అత్యంత సన్నిహింతగా ఉన్న నేతలను స్వయంగా విజయమ్మ ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారందరికీ సమావేశానికి రావాల్సిందిగా వర్తమానాలు పంపించారు.
వైఎస్ విజయమ్మ పర్సనల్‌గా కొంత మందికి ఫోన్లు చేసి మాట్లాడారు. వైఎస్ కేబినేట్లో పనిచేసిన వారు.. అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేతలతో విజయమ్మ మాట్లాడారు. వైఎస్సార్‌తో ఉన్న అనుబంధంతో సంస్మరణ కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అనేది ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్ డిబేట్ నడుస్తోంది. రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతో కార్యక్రమానికి హాజరవుతే.. పొలిటికల్‌గా తమ పరిస్థితి ఏంటనేది ఒకరికొకరు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్ కూతురు షర్మిల… వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరిట పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు. అయితే షర్మిల ఏర్పాటు చేసిన పొలిటికల్ పార్టీ వైపు.. కాంగ్రెస్ నేతలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్ వెంట నడిచిన కొండా దంపతులు సైతం షర్మిల వైపు చూడటం లేదు. ఇతర నాయకులు సైతం షర్మిల వెనక నడించేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఏర్పాటు చేసే సంస్మరణ కార్యక్రమానికి హాజరైతే.. బయటకు సంకేతాలు ఎలా వెళ్తాయనేది నేతల మధ్య చర్చజరుగుతోంది.
మొత్తం మీద విజయమ్మ పంపిన వర్తమానం తెలంగాణ కాంగ్రెస్ హాట్ టాఫిక్‌గా డిబేట్ జరుగుతోంది. కొందరు నేతలు వైఎస్ మీద ఉన్న అభిమానం వెళ్లి నివాళ్లు అర్పించాలని అంటుంటే.. మరికొందరేమో ఈ సమయంలో అందులోనూ షర్మిల పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసిన నేపథ్యంలో అక్కడికి వెళ్తే .. పొలిటికల్‌గా నష్టం జరుగుతుందా అనే లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు వెళ్తామంటుంటే.. మరికొందరు మాత్రం డైలమాలో ఉంటున్నారు. ఫైనల్‌గా ఈ సమావేశానికి ఎవరెవరు వెళ్తారు.. ఎవరెవరు డుమ్మా కొడతారనేది వేచి చూడాలి.
-అశోక్ భీమనపల్లి, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్