ఈ మంచానికి భలే గిరాకీ..! ఆ దేశంలో ఎంతకు విక్రయించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

New Zealand: ఇండియాలో విశ్రాంతి తీసుకోవాలంటే ముందుగా గుర్తుకువచ్చేది మంచం. దాదాపు అందరి ఇళ్లలోను ఉంటాయి. మార్కెట్‌లో ధరను బట్టి రకరకాల మంచాలు

ఈ మంచానికి భలే గిరాకీ..! ఆ దేశంలో ఎంతకు విక్రయించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Indian Cot
Follow us
uppula Raju

|

Updated on: Aug 31, 2021 | 2:59 PM

New Zealand: ఇండియాలో విశ్రాంతి తీసుకోవాలంటే ముందుగా గుర్తుకువచ్చేది మంచం. దాదాపు అందరి ఇళ్లలోను ఉంటాయి. మార్కెట్‌లో ధరను బట్టి రకరకాల మంచాలు దొరుకుతాయి. అయితే మనదేశపు మంచాలకు విదేశాలలో మంచి గిరాకీ ఉంది. విదేశీయులు మన మంచాలపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఎంత ధరయినా సరే లెక్కచేయకుండా కొనేస్తున్నారు. తాజాగా ఇండియాలో వేయి రూపాయలకు లభించే ఓ మంచాన్ని న్యూజిలాండ్ దేశస్థుడు రూ.41,000 వేలకు కొని ఆశ్చర్యపరిచాడు.

ఒక నివేదిక ప్రకారం.. ఈ మంచం అమ్ముతున్న వెబ్‌సైట్ దాని ధరను $ 800 గా నిర్ణయించింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 41000 వేలు. అయితే ఈ మంచం ఇండియాలోని ప్రతి దుకాణంలో కొనుగోలు చేయవచ్చు. దేశంలోని ఏదైనా స్థానిక మార్కెట్‌లో మీరు దీనిని రూ.1000 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్లినా మీకు సులభంగా మంచాలు దొరుకుతాయి. హైవే పక్కన ఉన్న దాబాలో నిత్యం మనకు మంచాలు కనిపిస్తాయి.

ప్రయాణీకులు తమ అలసటను తొలగించుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు. వాస్తవానికి న్యూజిలాండ్‌లో మంచాలకు భలే డిమాండ్ ఉంది. దీని కారణంగా కొన్ని వెబ్‌ సైట్లు వీటికి అధిక ధరను నిర్ణయించారు. అయినప్పటికీ ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇండియాకు చెందిన ఒక సాధారణంగా ఉత్పత్తిని అధిక ధరకు విక్రయించడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో చాలా వస్తువుల విషయంలో ఇది జరిగింది. వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఈ మంచం భారతదేశంలోనే తక్కువ ధరకు లభిస్తుందని రాశాడు.

DMHO Recruitment 2021: మంచి వేతనంతో మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగావకాశాలు.. ఇంటర్ అర్హత.. రేపే ఇంటర్వ్యూ.. వివరాల్లోకి వెళ్తే..

Jyothika: హిమాలయాల్లో త్రివర్ణ పతాకంతో జ్యోతిక.. లాక్‏డౌన్ డైరీలను పంచుకోవడం హ్యాపీ అంటూ ట్వీట్..

40 floor towers: 40 ఫ్లోర్స్.. నువ్వా నేనా అనేట్టు రెండు టవర్స్‌. మొత్తం 900 ప్లాట్స్. కానీ కూల్చేస్తున్నారు.. ఏమా కథ.?

Viral Video: జనాలు చూస్తుండగానే జింకను మింగేసిన కొండచిలువ.. స్పీడ్ చూసి షాకవుతారంటే.!