AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 floor towers: 40 ఫ్లోర్స్.. నువ్వా నేనా అనేట్టు రెండు టవర్స్‌. మొత్తం 900 ప్లాట్స్. కానీ కూల్చేస్తున్నారు.. ఏమా కథ.?

ఒకటి, రెండు కాదు.. ఏకంగా 900 ఫ్లాట్స్. నేల మీద నిలబడి చూస్తే.. ఆకాశాన్ని తాకినట్లే అనిపిస్తాయి. కాని.. ఈ బిల్డింగ్ ఇప్పుడు నేలమట్టం కాబోతుంది.

40 floor towers: 40 ఫ్లోర్స్.. నువ్వా నేనా అనేట్టు రెండు టవర్స్‌. మొత్తం 900 ప్లాట్స్. కానీ కూల్చేస్తున్నారు.. ఏమా కథ.?
Towers
Venkata Narayana
|

Updated on: Aug 31, 2021 | 2:12 PM

Share

Suprem court demolition orders: ఒకటి, రెండు కాదు.. ఏకంగా 900 ఫ్లాట్స్. నేల మీద నిలబడి చూస్తే.. ఆకాశాన్ని తాకినట్లే అనిపిస్తాయి. కాని.. ఈ బిల్డింగ్ ఇప్పుడు నేలమట్టం కాబోతుంది. దీనిపై నెలకొన్న వివాదం సుప్రీం వరకు వెళ్లడంతో.. కూల్చేయండి అంటూ.. కోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉన్న ఈ కన్‌స్ట్రక్షన్ ఇల్లీగల్ అన్నది కోర్టు కామెంట్స్ సారాంశం. 40 ఫ్లోర్స్ ఉన్న 2 టవర్స్‌లో మొత్తం 900 ప్లాట్స్ ఉన్నాయి. ఈ భారీ అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించిన కోర్టు.. రెండు నెలల్లో కస్టమర్లకు డబ్బులు చెల్లించాలని సూచించింది.

అంతేనా, కూలగొట్టడానికి అయ్యే ఖర్చు కూడా కంపెనీయే భరించాలని అత్యున్నత న్యాయస్థానం వివరించింది. ఇప్పటి వరకు ఈ స్కై టవర్స్‌లో 630 ఫ్లాట్స్‌ను కస్టమర్స్ బుక్ చేసుకున్నారు. ఈ నిర్మాణం చేపట్టిన సూపర్ టెక్ కంపెనీ.. నిర్మాణ రంగ నిబంధనలు ఉల్లింఘించింది. ముందు ఒక ప్లాన్‌తో వెళ్లిన నిర్మాణ కంపెనీ.. ఆ తర్వాత మార్చేసింది. అదే సమయంలో కస్టమర్లకు కంప్లీట్ ప్లాన్ ఇవ్వలేదు. రెండు టవర్ల మధ్య ఉండాల్సిన మినిమన్ గ్యాప్ మెయింటేన్ చేయలేదు.

ఫైర్ సెప్టీ రూల్స్ పాటించలేదు. గ్రీనరీ పెంచలేదు. ఇలా అనేక ఉల్లంఘనలకు పాల్పడటంతో ఈ భారీ నిర్మాణాలను కూల్చివేయాలంటూ కోర్టు ఆదేశించింది. రూల్స్ పాటించకుండా.. ఇంతపెద్ద బిల్డింగ్ నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారంటూ నోయిడా మున్సిపాలిటీకి అక్షింతలు వేసింది కోర్టు. సూపర్ టెక్ కంపెనీ నిర్మించిన బిల్డింగ్స్‌ను కూల్చివేయాలంటూ 2014లో అహ్మదాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది.

Read also: Rapolu: అనేక క్రియాశీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఇది కూడా తప్పనిసరిగా జరపాలి.. ప్రధానికి రాపోలు లేఖ