AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Steam Inhalation Therapy: జలుబుతో తరచుగా ఇబ్బందులు పడుతున్నారా.. పుదీనా ఆవిరి పట్టిచూడండి..

Steam Inhalation Therapy: సీజన్ మారిందంటే చాలు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు, దగ్గు. ఇక వర్షాకాలంలో సర్వసాధారణంగా అందరూ జలుబు, పడిశంతో ఇబ్బందులు..

Steam Inhalation Therapy: జలుబుతో తరచుగా ఇబ్బందులు పడుతున్నారా.. పుదీనా ఆవిరి పట్టిచూడండి..
Steam Inhalation Therapy
Surya Kala
|

Updated on: Aug 31, 2021 | 3:05 PM

Share

Steam Inhalation Therapy: సీజన్ మారిందంటే చాలు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు, దగ్గు. ఇక వర్షాకాలంలో సర్వసాధారణంగా అందరూ జలుబు, పడిశంతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయితే జలుబుకు వైద్య శాస్త్రంలో ఇప్పటివరకూ మందు కనుగొనలేదు. నిజానికి జలుబుకి ఎటువంటి మందులు అవసరం లేదు.. కొన్ని రోజులు ఇబ్బంది పెట్టి అదే తగ్గుతుంది.. అయితే ప్రస్తుతం కరోనా సమయం కనుక ఏది సీజనల్ వ్యాధి.. ఏది కరోనా అనేది తెలియకపోవడంతో నానా హైరానా పడిపోతున్నాం. ఇక జలుబు చేస్తే ఈ మహమ్మారి. ప్రశాంతంగా పడుకోనీదు, కూర్చోనీదు, నిలబడనీదు, పని చేసుకోనీదు. కనుక తక్షణ ఉపశమనం కోసం ప్రయత్నిస్తాం… జలుబు నుంచి సత్వరం నివారణ ఇచ్చేది ఆవిరి పట్టడం అయితే ఎక్కువమంది పసుపు, విక్స్ వేసుకుని ఆవిరి పడతారు.. కానీ దీనికంటే జలుబు నుంచి మంచి రిలీఫ్ ని ఇచ్చేది పుదీనా ఆవిరి అంటున్నారు ఆరోగ్య నిపుణలు.

పుదీనా ఒకరమైన ఆకు కూర.. ప్రకృతి అందించిన ఆరోగ్య వరం ఆకు కూరలు.. ఇవి కల్గించే ప్రయోజనం అంతా ఇంతా కాదు. ఆకుకూరలు శరీరానికి కావల్సిన అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు అందిస్తాయి. మనిషి జీవనశైలినే మార్చే సత్తా ఆకుకూరలకు ఉంది. అందులో పుదీనాది ప్రత్యేకమైన స్థానం.

జలుబూ, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వేడినీటిలో పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టి చూడండి. అలాగే ఈ వేడి ఆవిరిని నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు, గొంతు శుభ్రపడతాయి. గాలి పీల్చడానికి ఇబ్బంది ఉండదు. ఇక పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రకరకాల అలర్జీలనూ, ఆస్తమాను నివరిస్తుంది. ఇలా పుదీనాతో ఆవిరి పట్టడంతో పాటు.. పెద్దలు చెప్పిన ‘లంకణం పరమౌషధం; అని ఒక నానుడి ని గుర్తు తెచ్చుకుని ఆరోజు రాత్రి కేవలం పాలు, విటమిన్ సీ , సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లను తీసుకుని.. ఘన పదార్ధాలకు దూరంగా ఉంటె మర్నాడు ఉదయానికి జలుబు నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతారు.

Also Read: మంచి వేతనంతో మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగావకాశాలు.. ఇంటర్ అర్హత.. రేపే ఇంటర్వ్యూ.. వివరాల్లోకి వెళ్తే..