Tamanna Beauty Tips: మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త అవతారం.. బ్యాక్‌ టు ది రూట్స్‌…

మల్టీ టాలెంటెడ్‌ అన్న పేరు ఇండస్ట్రీలో హీరో విషయంలో మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంటుంది. హీరోలు యాక్టింగ్ మాత్రమే కాకుండా ... సింగింగ్‌, లిరిక్‌ రైటింగ్‌, డైరెక్షన్‌, టెలివిజన్ హోస్టింగ్ లాంటి క్రాఫ్ట్స్‌లోనూ సత్తా చాటుతున్నారు.

Tamanna Beauty Tips: మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త అవతారం.. బ్యాక్‌ టు ది రూట్స్‌...
Tamanna
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 31, 2021 | 3:08 PM

Tamanna Beauty Tips: మల్టీ టాలెంటెడ్‌ అన్న పేరు ఇండస్ట్రీలో హీరో విషయంలో మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంటుంది. హీరోలు యాక్టింగ్ మాత్రమే కాకుండా … సింగింగ్‌, లిరిక్‌ రైటింగ్‌, డైరెక్షన్‌, టెలివిజన్ హోస్టింగ్ లాంటి క్రాఫ్ట్స్‌లోనూ సత్తా చాటుతున్నారు. మరి ఈ రేంజ్ టాలెంట్ హీరోయిన్స్‌లో లేదా…? అంటే ఆన్సర్ చెప్పటం కాస్త కష్టమే. నార్త్‌లో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ ఒకరిద్దరు కనిపించినా.. సౌత్‌లో మాత్రం అలాంటి భామలు అస్సలు కనిపించారు. అయితే ఇప్పుడు ఆ లోటు తీర్చేస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్‌ గా గ్లామర్‌ ఫీల్డ్‌ను రూల్‌ చేస్తున్న ఈ బ్యూటీ.. ఇతర విభాగాల్లోనూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే నటిగా సిల్వర్‌ స్క్రీన్‌తో పాటు స్మార్ట్ స్క్రీన్స్‌లోనూ సత్తా చాటారు. హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌లోనే ఓటీటీలో లెవెన్త్ అవర్‌, నవంబర్‌ స్టోరీస్‌ లాంటి షోస్‌తో తన స్థాయిని పెంచుకున్నారు.

రీసెంట్‌గా స్మార్ట్ స్క్రీన్‌ టు స్మాల్ స్క్రీన్ మరో స్టెప్ వేశారు ఈ బ్యూటీ. ఇంటర్నేషనల్ కుకరీ షో మాస్టర్‌ చెఫ్ తెలుగు వర్షన్‌కు హోస్ట్‌గా చేస్తున్నారు. మదర్‌ టంగ్ తెలుగు కాకపోయినా.. ఈ షోలో తమన్నా చూపిస్తున్న ఈజ్‌ ఆడియన్స్‌నే కాదు… ఇండస్ట్రీ జనాలను కూడా సర్‌ప్రైజ్‌ చేసింది.

తాజాగా ఈ బ్యూటీ మరో ఇంట్రస్టింగ్ స్టెప్ వేశారు. యాక్టర్, హోస్ట్‌గా మాత్రమే కాదు రైటర్‌ గా కూడా ప్రూవ్‌ చేసుకుంటున్నారు. బ్యాక్‌ టు ది రూట్స్ పేరుతో ఓ బుక్‌ రిలీజ్ చేస్తున్నారు తమన్నా. బేసికల్‌గా ఫిట్‌నెస్ ప్రీక్‌ అయిన తమ్ము.. ఈ బుక్‌లో తన గ్లామర్‌, ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ను రివీల్ చేస్తున్నారు. రీసెంట్‌గా కోవిడ్ నుంచి కోలుకున్న టైమ్‌లో తమన్నా ఫిట్నెస్‌ మీద విమర్శలు వినిపించాయి.

అయితే ఆ కామెంట్స్‌ను స్పోర్టివ్‌గా తీసుకున్న మిల్క్ బ్యూటీ… స్ట్రిక్ట్ డైట్‌… యోగా, రెగ్యులర్ వర్కవుట్స్‌తో తిరిగి తన ఛార్మ్‌ సాధించగలిగారు. అయితే ఈ జర్నీలో తన ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటు తన డైట్‌ అండ్‌ వర్క్‌ అవుట్‌ టిప్స్‌ను బ్యాక్‌ టు ది రూట్స్‌ బుక్‌లో రివీల్ చేశారు.

తమన్నా ఇన్‌స్టా పోస్ట్..

– సతీష్, ET డెస్క్, టీవీ9 తెలుగు

Also Read..

వివాదాల వర్మతో రచ్చ చేసిన జ్యోతి.. ఇది మీ జీవితం మీ ఇష్టం అంటూ కామెంట్లు పెడుతోన్న నెటిజన్లు.

హిమాలయాల్లో త్రివర్ణ పతాకంతో జ్యోతిక.. లాక్‏డౌన్ డైరీలను పంచుకోవడం హ్యాపీ అంటూ ట్వీట్..