AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: వివాదాల వర్మతో రచ్చ చేసిన జ్యోతి.. ఇది మీ జీవితం మీ ఇష్టం అంటూ కామెంట్లు పెడుతోన్న నెటిజన్లు.

RGV Dance: వర్మ, వివాదం... ఈ రెండు పదాలను వేరు చేసి చూడలేం. వర్మ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది. లేదా వివాదం ఎక్కడ ఉంటే అక్కడ తాను ఉండేలా చూసుకుంటారు..

RGV: వివాదాల వర్మతో రచ్చ చేసిన జ్యోతి.. ఇది మీ జీవితం మీ ఇష్టం అంటూ కామెంట్లు పెడుతోన్న నెటిజన్లు.
Rgv Dance Video
Narender Vaitla
|

Updated on: Aug 31, 2021 | 1:10 PM

Share

RGV Dance: వర్మ, వివాదం… ఈ రెండు పదాలను వేరు చేసి చూడలేం. వర్మ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది. లేదా వివాదం ఎక్కడ ఉంటే అక్కడ తాను ఉండేలా చూసుకుంటారు రామ్‌గోపాల్‌ వర్మ. ఏది ఏమైనా నిత్యం వార్తల్లో నిలవడం ఒక్క వర్మకే చెల్లుతుందని చెప్పాలి. తనను ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చినట్లు బతుకుతానని చెప్పుకునే వర్మ.. ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియానా బోల్డ్‌ ఇంటర్వ్యూతో మొదలైన వర్మ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇటీవల ఇయానా సుల్తానా అనే అప్‌కమింగ్‌ నటి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా వర్మ చేసిన రచ్చ తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇయానాతో వర్మ చేసిన డ్యాన్స్‌ సోషల్ మీడియాను షేక్‌ చేస్తుండగా.. ఇదే పార్టీలో పాల్గొన్న మరో నటి జ్యోతితో కూడా వర్మ స్టెప్పులు వేశారు. సాగర సంగమం సినిమాలోని ‘తకిట తదిమి తందానా’ అనే వేదాంతంతో కూడిన మాస్‌ పాటకు వర్మ, జ్యోతితో కలిసి వేసిన మాస్ స్టె్ప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను నటి జ్యోతి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు నెగిటివ్‌ కామంట్లు పెడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం జ్యోతికి మద్ధతుగా నిలుస్తున్నారు. ‘జ్యోతిగారు ఇది మీ జీవితం, మీకు నచ్చినట్లు బతకండి. ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీమంతా మీ వెంట ఉన్నాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వర్మ చేస్తున్న ఈ రచ్చపై మీ అభిప్రాయమేంటో మీరూ తెలపండి.

View this post on Instagram

A post shared by Jo (@jyothiactress)

Also Read: Bapu: తెలుగువారి సంస్కృతిలో భాగమయిన బాపు బొమ్మలు.. నేడు బహుముఖ ప్రజ్ఙాశీలుని వర్థంతి.. ఫొటో గ్యాలరీ

Payal Sarkar: డైరెక్టర్ పేరుతో ఆకతాయిల వేధింపులు.. సైబర్ క్రైమ్‏కు ఫిర్యాదు చేసిన హీరోయిన్..

Mahathalli: కొత్త కారు కొనుగోలు చేసిన మహాతల్లి.. తన భర్త తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఇదేనంటూ..