AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahathalli: కొత్త కారు కొనుగోలు చేసిన మహాతల్లి.. తన భర్త తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఇదేనంటూ..

Mahathalli: జాహ్నవి దాసెట్టి... ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయిన్పటికీ, 'మహాతల్లి' అంటే వెంటనే గుర్తుపడతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్‌, సోషల్‌ మీడియా...

Mahathalli: కొత్త కారు కొనుగోలు చేసిన మహాతల్లి.. తన భర్త తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఇదేనంటూ..
Mahathalli Car
Narender Vaitla
|

Updated on: Aug 31, 2021 | 12:00 PM

Share

Mahathalli: జాహ్నవి దాసెట్టి… ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయిన్పటికీ, ‘మహాతల్లి’ అంటే వెంటనే గుర్తుపడతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్‌, సోషల్‌ మీడియా మీద కొంచెం అవగాహన్న దాదాపు అందరు అమ్మాయిలకు మహాతల్లి పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టైలిష్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పాపులర్‌ అయ్యింది జాహ్నవి. మహాతల్లి పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి ఫన్నీ వీడియోలను పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం మహాతల్లి యూట్యూబ్‌ చానల్‌కు 19 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటేనే మహాతల్లి క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మహాతల్లి సోషల్‌ మీడియాలో చిన్న వీడియో పోస్ట్ చేసినా లక్షల సంఖ్యలో లైక్స్‌, షేర్స్‌ వస్తాయి. ఇదిలా ఉంటే జాహ్నవి ఇటీవల కొత్త కారును కొనుగోలు చేసింది. ఎమ్‌జీ హెక్టార్‌ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్‌ కారును కొనుగోలు చేసిన జాహ్నవి.. కారుకు సంబంధించి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక కారు ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేసే విషయమంలో అందరూ వద్దని వారించినా.. తన భర్త ఎలక్ట్రిక్‌ కారును కోనుగోలు చేశాడని, ఇది గొప్ప నిర్ణయమని క్యాప్షన్‌ రాసుకొచ్చింది జాహ్నవి. ఇక ఈ పోస్ట్‌ చూసిన మహాతల్లి ఫాలోవర్స్‌ శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Shilpa Shetty: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సాగర కన్య !… ఆ ట్వీట్‏కు అర్థం అదేనా ? బాలీవుడ్‏లో మరో చర్చ..

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి, 8మందికి తీవ్రగాయాలు.. దైవ దర్శనం చేసుకుని వస్తుండగా కబళించిన మృత్యువు

Chinese Apps: భారత్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్న చైనా యాప్స్‌.. మూలాలు తెలియకుండా జాగ్రత్త..!