AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautham Ghattamaneni: పుత్రోత్సాహంతో పొంగి పోతున్న సూపర్‌ స్టార్‌.. నువ్వు ఎదగుతున్న తీరు చూడడం నాకెంతో సంతోషాన్నిస్తుంది అంటూ.

ఘట్టమనేని కుటుంబంలోని హీరోలను తెలుగు ప్రేక్షకులను ఎంతగా అభిమానిస్తారో చెప్పా్ల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Gautham Ghattamaneni: పుత్రోత్సాహంతో పొంగి పోతున్న సూపర్‌ స్టార్‌.. నువ్వు ఎదగుతున్న తీరు చూడడం నాకెంతో సంతోషాన్నిస్తుంది అంటూ.
Gautham
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2021 | 12:47 PM

Share

ఘట్టమనేని కుటుంబంలోని హీరోలను తెలుగు ప్రేక్షకులను ఎంతగా అభిమానిస్తారో  చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ అనంతరం ఆయన తనయుడు మహేష్ బాబు ప్రస్తుతం అగ్రహీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. అందరు మహేష్‏ను ప్రిన్స్ అని పిలుచుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు కళల రాకుమారుడిగా ఉండిపోయారు మహేష్ బాబు. నమ్రతతో వివాహం అనంతరం కూడా మహేష్ క్రేజ్ ఏమాత్రం తగ్గిపోలేదు. ఇప్పటికే అమ్మాయిల క్రష్‏గా సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడనే చెప్పుకోవాలి. ఇక మహేష్ ఫ్యామిలీ నుంచి మరో ప్రిన్స్ టాలీవుడ్ రాబోతున్న సంగతి తెలిసిందే. అతనే.. మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని. చిన్నప్పటి నుంటి టీనేజర్ వరకు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఫుల్ క్రేజ్ సంపాదించాడు గౌతమ్. అందంలో, ఫాలోయింగ్ క్రేజ్ చూస్తే తాతకు, తండ్రికి ఏమాత్రం తీసిపోడని అనిపిస్తుంటుంది. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‏గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను దగ్గరయ్యాడు. ఈరోజు గౌతమ్ 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

సోషల్ మీడియా వేదికగా గౌతమ్‏కు శుభాకాంక్షలు చెబుతున్నారు. గౌతమ్‏కు మహేష్ బాబు, నమ్రతతోపాటు.. చెల్లెలు సితార కూడా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ చెబుతున్నారు. హ్యాప్పీ 15 మై సన్.. నువ్వు ఎదగడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. అంటూ ట్వీట్ చేశాడు మహేష్. గౌతమ్ 2006లో ఆగస్ట్ 31న జన్మించాడు. ఇక 8 సంవత్సరాల వయసులోనే 1 నేనొక్కడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించాడు. ఇక 2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన గౌతమ్ తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌లోని టాప్ 8 ఈతగాళ్ళలో స్థానం దక్కించుకున్నాడు. ఈతలోని నాలుగు విధానాల్లో గౌతమ్ అద్భుతంగా ఈదగలడు. మహేష్ తర్వాత గౌతమ్ కూడా వెండితెర పై స్టార్ హీరోగా ఎప్పుడెప్పుడు వస్తాడా ? అని ప్రిన్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్వీట్.

Also Read: Shilpa Shetty: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సాగర కన్య !… ఆ ట్వీట్‏కు అర్థం అదేనా ? బాలీవుడ్‏లో మరో చర్చ..