- Telugu News Photo Gallery Spiritual photos Director Bapu pictures influenced the Telugu culture august 31st his death anniversary photo gallery
Bapu: తెలుగువారి సంస్కృతిలో భాగమయిన బాపు బొమ్మలు.. నేడు బహుముఖ ప్రజ్ఙాశీలుని వర్థంతి.. ఫొటో గ్యాలరీ
Director Bapu pictures: బాపు. తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, ఆయన వ్రాత, చేత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యేంతలా ప్రభావితం చేశాయి.
Updated on: Aug 31, 2021 | 12:58 PM

ప్రముఖ దర్శకులు, తెలుగు రచయిత, కార్టూనిస్ట్, చిత్రకారులు బాపు వర్థంతి నేడు. ఆయన చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖ చిత్రాలూ లెక్కకు మిక్కిలి.

బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరులో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.

1955 వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు.

బాపువేసే బొమ్మల్లోని మనుషులు వాస్తవ వ్యక్తులే అయి ఉంటే వారు. ఆయా పాత్రల మనస్థితీ, స్వభావమూ బొమ్మలో రూపుకట్టినట్టు కనిపిస్తుంది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన బాపు చెన్నైలోని మలార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2014, ఆగష్టు 31న గుండెపోటుతో మరణించారు. నేడు బాపు వర్థంతి.





























