TRS: హ‌స్తినలో గులాబీ దండు.. గల్లీ టూ ఢిల్లీకి టీఆర్ఎస్.. జలదృశ్యంలో పుట్టి దేశ రాజ‌ధానికి చేరిన కేసీఆర్‌ సామ్రాజ్యం..

దేశ రాజధాని ఢిల్లీలో TRS‌కి ఓ ఆఫీస్ రాబోతోంది. ఆఫీస్ నిర్మాణం పూర్తైతే.. ఢిల్లీలో శాశ్వత కార్యాలయమున్న వన్ అండ్ ఓన్లీ పార్టీగా టీఆర్ఎస్ అవతరిస్తుంది.

TRS: హ‌స్తినలో గులాబీ దండు.. గల్లీ టూ ఢిల్లీకి టీఆర్ఎస్.. జలదృశ్యంలో పుట్టి దేశ రాజ‌ధానికి చేరిన కేసీఆర్‌ సామ్రాజ్యం..
Trs
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 31, 2021 | 4:09 PM

TRS.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన ఉద్యమ పార్టీ. TRS పుట్టుక, ప్రస్థానం అంతా వైవిధ్యమే. ఉద్యమ పార్టీగా మొదలైనప్పట్నుంచి పక్కా పొలిటికల్ పార్టీగా మారే వరకు TRS ఏం చేసినా ప్రత్యేకమే, ఒక చరిత్రే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించి, వరుసగా రెండుసార్లు పాలనా పగ్గాలు అందుకున్న TRS.. ఇప్పుడు మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఆ మాటకొస్తే, తెలుగు రాష్ట్రాల పొలిటికల్ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు రెడీ అయ్యింది.

21 ఏళ్ల సుధీర్ఘ ప్రస్థానం… జలదృశ్యంలో మొదలై .. ఆ తర్వాత జనదృశ్యమై ఢిల్లీ ని వణికించిన చరిత్ర.. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం గల్లీలో మొదలైన కొట్లాట ఉధృతమై..ఉప్పెనలా మారి ఢిల్లీని తాకింది. విజయ తీరాలను చేరింది. స్వ‌రాష్ట్రంలో వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చింది. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం నిర్మించబోతోంది. దాంతో, తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీలో శాశ్వత కార్యాలయమున్న వన్ అండ్ ఓన్లీ పార్టీగా టీఆర్ఎస్ అవతరించబోతోంది. జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేయ్యడానికి గల్లీ టూ ఢిల్లీ వ‌ర‌కు త‌న స‌మ్రాజ్యాన్ని విస్త‌రింప‌జేస్తూ దేశ రాజ‌ధాని హ‌స్తినా పూరంలో తెలంగాణ భ‌వ‌న్ కు శంఖు స్థాప‌న చేసుకుంటున్న TRS పై టివి9 స్పేష‌ల్ స్టోరీ.

2001 ఏప్రిల్ 21 న తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న కోంత మంది నాయకులతో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు…2001 లో పార్టి ఏర్పాటు అయ్యాక 2004 లో కాంగ్రెస్ పార్టిలో పోత్తు పేట్టుకోని సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న హ‌వ చాటింది గులాభి పార్టి 2004 ఎన్నిక‌ల్లో 26 ఎమ్మెల్యేలు,5 ఎంపిలు గెలిచి రాజ‌శేఖ‌ర్ రెడ్డి క్యాబినేట్ తో పాటు మ‌న్మొహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలోను చెరింది టిఆర్ఎస్ పార్టి… కేసిఆర్ కేంద్ర మంత్రి అయ్యారు..అయితే 2001 నుండి 2004 వ‌ర‌కు కూడ టిఆర్ఎస్ కు సోంత పార్టి కార్యాల‌యం లేదూ…

2001 లో స్వ‌ర్గియ కోండా ల‌క్ష్మ‌ణ్ బాపూజి నివాస‌మ‌యిన జ‌ల‌దృష్యంలో పార్టి కార్యాల‌యాన్ని ప్రారంభించి ప్ర‌స్థానం మొద‌లు పేట్టిన తెలంగాణ రాష్ఠ్ర‌స‌మితి కోన్ని నెల‌లు అక్క‌డే నుండి కార్య‌కాల‌పాటు సాగించి కోద్ది కాలం త‌రువాత అక్క‌డ నుండి నంది న‌గర్ లోని త‌న సోంత ఇంటికి అక్క‌డ నుండి MLA కాల‌నికి చేరుకుంది. 2004 లో కాంగ్రెస్ క్యాబినే లో చేరిన తరువాత అప్ప‌టి ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి బంజారాహిల్స్ టిఆర్ఎస్ పార్టి కార్యాల‌యం నిర్మాణం కోసం ఏక‌రం స్థాలం కేటాయించారు…

ల్యాండ్ కేటాయింపు పూర్తి అవ్వ‌గానే 2004 డిసెంబ‌ర్ 11న తెలంగాణ రాష్ట్రానికి మ‌ద్ద‌తు ఇచ్చిన ప‌లు ప్రాంతియ పార్టీల ముఖ్య నేత‌లు అజిత్ సింగ్, మ‌హ‌బూబ ముఫ్తి, రాందాస్ హ‌త‌వాళేల‌తో క‌లిసి పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయ‌గా కేవలం ఏడాది స‌మ‌యంలోనే భ‌నాన్ని పూర్తి చేసి 2006 అగ‌స్టు 14న త‌మిళ‌నాడు పీఎంకే నేత రాందాస్‌తో పార్టీ కార్య‌లయాన్ని ప్రారంభించారు సీఎం KCR.

2006 లో పార్టీ కార్యాల‌యం ప్రారంభం త‌రువాత TRS త‌న జోరు పెంచింది. స్వరాష్ట్రం కాంక్ష సాధ‌న‌లో భాగంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట నిల‌బేట్టుకోలేదంటూ 2006 లోనే కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజినామ చేసిన KCR కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌లా నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు. MP ప‌ద‌వికి రాజీనామా చేసి కరీంనగర్‌ MPగా మళ్లీ ఉప ఎన్నిక‌లో గెలిచి TRS స‌త్తా చాటింది. ఇలా 2009 లో టిడిపి తో పోత్తు పేట్టుకోని 10 MLAలు.

2 MP సీట్లను గెలువ‌గా 2009 న‌వంబ‌ర్ 29న తెలంగాణ సాధ‌న కోసం అమ‌ర‌ణ నిరాహ‌ర ధీక్ష చేప‌ట్టారు KCR.. దాని తరువాత ఉద్య‌మం తార‌స్థాయికి చెర‌డం.. కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్ర‌క‌ట‌న చేయ్య‌డం.. ఆ తారువాత ప్ర‌క‌ట‌న వేన‌క్కి తీసుకోవ‌డంతో జ‌రిగిన ప‌రిణామాలు చివ‌రిగా 2014 లో ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు 2014 ఎన్నిక‌ల్లో TRS ఒటరిగా పోటి చేసి తెలంగాణలో తొలి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. 2018లోనూ మ‌ళ్లీ తానే అధికారంలోకి రావ‌డం తెలిసిందే.

ఇది ఇన్నాళ్లు తెలంగాణ కేంద్రంగా TRS ప్ర‌స్థానం.. ఎన్నో రాజకీయ సుడి గుండాలను దాటుకుని సుస్థిర పాలన సాగిస్తోంది. ఇక ఇప్పుడు ఢిల్లీ గడ్డ మీద సగౌరవంగా సొంత పార్టీ కార్యాలయం నిర్మించుకుంటోంది. గులాబీ సువాసనలు రాజధాని నగరంలో గుబాళించేలా చేస్తోంది. ఢిల్లీలో TRS పార్టీ కార్యాలయ నిర్మాణానికి రెడీ అవుతోంది. ఢిల్లీ వసంత్ విహార్ లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 11వందల చదరపు మీటర్ల స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2 న సీఎం KCR ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు.

పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. TRS ప్రస్థానంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం ఒక మైలు రాయి అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు జాతీయ రాజకీయాల్లో TRS క్రియాశీలక పాత్ర పోషించడానికి ఈ కార్యాలయం వేదిక కాబోతుందా.. అన్న రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి.

TRS పార్టీ వర్గాలు మాత్రం జాతీయ రాజకీయాల అంశంపై ఇపుడే ఏం చెప్పలేం అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి రానున్న రోజుల్లో ఢిల్లి సెంట‌ర్ గా గులాబీ బాస్ KCR ఎలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్ఠిస్తారో చూడాలి.

శ్రీధ‌ర్ ప్ర‌సాద్, TV9 తెలుగు, హైదరాబాద్

ఇవి కూడా చదవండి: Chinese Apps: భారత్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్న చైనా యాప్స్‌.. మూలాలు తెలియకుండా జాగ్రత్త..!

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి, 8మందికి తీవ్రగాయాలు.. దైవ దర్శనం చేసుకుని వస్తుండగా కబళించిన మృత్యువు