TS Schools Reopen: రేపు తెలంగాణలో స్కూల్స్ నిర్వహణపై కొనసాగుతున్న సస్పెన్స్.. సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం
Corona-TS Schools Reopen:కరోనా థర్డ్ వేవ్ రానున్నదని ముందస్తు చర్యలు తీసుకోమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో పాఠశాల రీ ఓపెనింగ్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది..
Corona-TS Schools Reopen:కరోనా థర్డ్ వేవ్ రానున్నదని ముందస్తు చర్యలు తీసుకోమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో పాఠశాల రీ ఓపెనింగ్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. తెలంగాణ లో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను తెరవడానికి వైద్య ఆరోగ్య శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి విద్యార్థుల తరగతి నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి దశలో 8, 9, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇతర కళాశాలల్లోకి విద్యార్థులను అనుమతించాలని యోచిస్తున్నారు. తర్వాత కిందిస్థాయి తరగతులను ప్రారంభించాలన్నది ప్రణాళిక. ఈ నేపథ్యంలో ఈ విషయం హైకోర్టు మెట్లు ఎక్కింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన వద్దని దాఖలైన పిటిషన్ ను ధర్మసనం విచారించింది. దీంతో రేపు ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై ఉత్కంఠ కొనసాగుతుంది.
రేపు బడులు ప్రారంభిస్తారా లేదా వాయిదా వేస్తారా అన్న విషయం పై సాయంత్రానికి స్పష్టత రానున్నది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బడుల ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కోసం విద్యా శాఖ వేచిచూస్తోంది. అయితే హైకోర్టు విద్యార్థులను ప్రత్యక్ష బోధనకు హాజరుకావాలని బలవంతం చేయొద్దని .. బలవంతం చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని.. అలాగే గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ఇప్పట్లో ప్రారంభించవద్దని సూచించిందని. దీనిపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ను ఆదేశించింది హైకోర్టు. దీంతో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ మెమో సవరించనున్నది. విద్యా సంస్థల ప్రారంభంపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కరోనా ఉదృతి కారణంగా ఏడాదిన్నర గా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి విద్యార్థులు ఆన్లైన్ క్లాస్ లతో చదువులను కొనసాగిస్తున్నారు.
Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ పెద్ద మనసు.. మరణించిన అభిమాని కూతురిని పదేళ్లుగా చదవిస్తున్న చిరంజీవి..