Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Aug 31, 2021 | 3:18 PM

అసలే పాకిస్తాన్‌.. ఆ పక్కనే ఆఫ్ఘనిస్తాన్. అక్కడి తాలిబన్లు, ఇక్కడ వీళ్లు ఒక్కటైతే మరి మన కశ్మీర్‌పై కన్నేయకుండా ఉంటారా. అందుకే రక్షణశాఖ అలర్ట్ అయ్యింది. ఆప్ఘనిస్థాన్‌‌లో తాలిబన్ల రాజ్యం మొదలైన నాటి నుంచి...

Terrorists Planning: భారీ దాడులకు టెర్రరిస్టుల ప్లాన్.. ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్
Pakistan Terrorists Plannin

అసలే పాకిస్తాన్‌.. ఆ పక్కనే ఆఫ్ఘనిస్తాన్. అక్కడి తాలిబన్లు, ఇక్కడ వీళ్లు ఒక్కటైతే మరి మన కశ్మీర్‌పై కన్నేయకుండా ఉంటారా. అందుకే రక్షణశాఖ అలర్ట్ అయ్యింది. ఆప్ఘనిస్థాన్‌‌లో తాలిబన్ల రాజ్యం మొదలైన నాటి నుంచి ఉగ్రవాదులంతా మరోసారి తమ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబన్లు పలు జైళ్లలో ఖైదీలుగా ఉన్న అనేకమంది ఉగ్రవాదులను విడిపించడంతో వారిపై దృష్టి పెట్టింది. అంటే, తాలిబన్లు ఇతర ఉగ్రవాదులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా అనుమానిస్తోంది.

ఈ క్రమంలో తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌ను పాకిస్థాన్ తర్వాత మరో నివాసంగా చేసుకునేందుకు ఐఎస్, లష్కరే తొయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు సిద్దమవుతున్నాయి. ఇక ఇప్పుడు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆప్ఘనిస్థాన్ కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారత్‌కు ఉగ్రముప్పు పొంచివున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జేషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్.. ఆప్ఘన్ తాలిబన్లతో కలవడం కలకలం రేపుతోంది. మౌలానా మసూద్ అజహర్ జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు తాలిబన్ల సాయం కోరినట్లుగా తెలుస్తోంది.

ఇండియా, చైనా సరిహద్దు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో చైనా, పాకిస్థాన్ కలిసి ఇండియాపై కుట్రలు చేస్తున్నాయని తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు చైనా, పాకిస్తాన్ ISI ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వారిని భారత్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని.. భారత్‌లో విధ్వంస రచన చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

జమ్ము కశ్మీర్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలను పెద్ద ఎత్తున సాగించాలని, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రహస్యంగా చేరవేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ ఉగ్రవాద సంస్థల వెనుక పాకిస్తాన్, చైనా ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. చైనా ఆదేశాల మేరకు ఐఎస్ఐ కుట్రలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఇండియాలోకి చొరబడాలని, దాడులకు పాల్పడేలా పీఓకేలోని యువతను ప్రోత్సహిస్తున్నట్లుగా గుర్తించారు.

లడక్ లోని వాస్తవాధీన రేఖ వెంట చైనా దుందుడుకు చర్యలతో భారత దళాలు దృష్టి సారించాయి. అదే సమయంలో  భారత భూభాగంలోకి  LoC ద్వారా 400 మంది ఉగ్రవాదులను పంపించాలనే కుట్రలు చేస్తోంది పాకిస్తాన్. ఈ క్రమంలోనే కశ్మీర్ లోయ ద్వారా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా తరలించేందుకు చూస్తున్నారు. దీంతో భారత భద్రతా దళాలు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చొరబాటు నిరోధక గ్రిడ్ ను మరింత బలోపేతం చేస్తోంది.

జమ్ము కశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) ప్రాంతంలో  గత 15 రోజులుగా వారి కదలికలు పెరిగినట్లుగా ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  కశ్మీర్‌లో పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని భద్రతా సంస్థలకు హెచ్చరికలు వచ్చాయని ఆయన వెల్లడించారు.

అయితే ఇప్పటికే లోయలో లష్కరే తోయిబా , జైష్-ఇ-మహ్మద్ , హిజ్బుల్ ముజాహిదీన్‌తోపాటు ఇతర ఉగ్రవాదుల కదలికలపై దృష్టి పెట్టాయి నిఘా సంస్థలు. వారు ఎప్పుడైనా గ్రెనేడ్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.  శ్రీనగర్‌లో IED దాడులకు పాల్పడే అవకాశం ఉందని భద్రతా సంస్థలు హెచ్చరించాయి.

దీనితోపాటు ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత జమ్ము కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సోషల్ మీడియాలో  అకస్మాత్తుగా ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరగినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. లోయలో యువతను ఉద్దేశించి అనేక కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Chinese Apps: భారత్‌లో గుట్టుచప్పుడు కాకుండా విస్తరిస్తున్న చైనా యాప్స్‌.. మూలాలు తెలియకుండా జాగ్రత్త..!

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి, 8మందికి తీవ్రగాయాలు.. దైవ దర్శనం చేసుకుని వస్తుండగా కబళించిన మృత్యువు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu