Bank Holidays September 2021: కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్లో 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడెప్పుడంటే..
కొత్త నెల రావడంతో పలు అంశాలల్లో ప్రధాన మార్పులు సంబవిస్తుంటాయి. అలాగే నెల నెల బ్యాంకుల సెలవులు మారిపోతాయి. ప్రస్తుత పరిస్థితులలో
కొత్త నెల రావడంతో పలు అంశాలల్లో ప్రధాన మార్పులు సంబవిస్తుంటాయి. అలాగే నెల నెల బ్యాంకుల సెలవులు మారిపోతాయి. ప్రస్తుత పరిస్థితులలో బ్యాంకులకు వెళ్లే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచింది.. ముఖ్యంగా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సెప్టెంబర్ నెలలో బ్యాంకులు 12 రోజులు బంద్ కానున్నాయి. ఎప్పుడెప్పుడో తెలుసుకుందామా.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నెలలో 12 రోజులు అలాగే రెండవ, నాలుగవ శనివారాలు, అదివారాలు బ్యాంకులు మూసివేయనున్నారు. అయిత రాష్ట్రాల వారిగా ఈ సెలవులలో మార్పులు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు గెజిటెడ్ సెలవులు మాత్రమే పాటిస్తాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం నెగోషియబుల్ ఇన్ర్ట్సుమెంట్స్ యాక్ట్ కింద సెలవులు, నెగోషియబుల్ ఇన్ర్టుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే కింద బ్యాంకులు సెలవులను నిర్ణయిస్తారు. ఈ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. గణేష్ చతుర్థి, తీజ్ వంటి పండుగలకు బ్యాంకు సెలవులు ఉన్నాయి.
బ్యాంక్ హాలీడేస్.. సెప్టెంబర్ 5- ఆదివారం సెప్టెంబర్ 8- శ్రీమంత శంకరదేవుని తిథి సెప్టెంబర్ 9- తీజ్ (హరితాళిక) సెప్టెంబర్ 10- గణేష్ చతుర్థి/సంవత్సరి (చతుర్థి పక్ష)/వినాయకర్ చతుర్థి/వరసిద్ధి వినాయక వ్రతం సెప్టెంబర్ 11- రెండవ శనివారం / గణేష్ చతుర్థి (2 వ రోజు) సెప్టెంబర్ 12- ఆదివారం సెప్టెంబర్ 17- కర్మ పూజ సెప్టెంబర్ 19- ఆదివారం సెప్టెంబర్ 20- ఇంద్రజాత్రా (గ్యాంగ్‌టక్‌లో సెలవు) సెప్టెంబర్ 21- శ్రీ నారాయణ గురు సమాధి రోజు సెప్టెంబర్ 25- నాల్గవ శనివారం సెప్టెంబర్ 26- ఆదివారం
అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితికి సెలవు ఉంటుంది. అలాగే రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎప్పటిలాగే పనిచేస్తాయి. కస్టమర్‌లు ఆన్‌లైన్ మోడ్‌ల ద్వారా లావాదేవీలు చేయవచ్చు.
Also Read: Viral Video: చిరుతపై సింహాల గుంపు ఎటాక్.. వేట మాములుగా లేదు.. చివరికి ఏమైందంటే!