Viral Video: చిరుతపై సింహాల గుంపు ఎటాక్.. వేట మాములుగా లేదు.. చివరికి ఏమైందంటే!

Ravi Kiran

Ravi Kiran | Edited By: Anil kumar poka

Updated on: Sep 04, 2021 | 8:33 PM

సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో నెటిజన్లు ఎక్కువగా జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు చూస్తారు..

Viral Video: చిరుతపై సింహాల గుంపు ఎటాక్.. వేట మాములుగా లేదు.. చివరికి ఏమైందంటే!
Lion

పిల్లి-ఎలుక, పాము-ముంగీస, కుక్క-పిల్లి.. ఇలా కొన్ని జంతువులు పోట్లాడుకోవడం మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. ఒకవేళ లైవ్‌లో వీరి పోరాటాన్ని చూడకపోయినా.. సోషల్ మీడియాలో వీడియోలనైనా చూస్తాం. కానీ మీరెప్పుడైనా సింహం, చిరుత మధ్య పోరాటాన్ని చూశారా.? ఇలాంటివి అత్యంత అరుదుగా జరుగుతుంటాయి. అంతేకాకుండా సమవుజ్జీల మధ్య పోరు అత్యంత భయానకంగా ఉంటుందని చెప్పాలి. అలాంటి పోరాటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అడవిలోని నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అక్కడ వేటాడితేనే కడుపుకు ఆహరం దొరుకుతుంది. ఆకలి తీరుతుంది. ఈ క్రమంలోనే చాలా జంతువులు క్రూర మృగాల చేతులకు చిక్కి చనిపోతుంటాయి. అడవికి రారాజు సింహం అని మనదరికీ తెలుసు. దాని పంజా పవర్, వేట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చిరుత కూడా తక్కువేం కాదు. అవి అద్భుతమైన వేటగాళ్ళు అని చెప్పొచ్చు. వేగాన్ని, వ్యూహాన్ని అమలు చేస్తూ వేటాడుతుంది. అయితే తాజాగా ఓ సింహాల గుంపు చిరుతను తమ ఎరగా చేసుకున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో సింహాలు అన్నీ కూడా చిరుతను చుట్టుముట్టాయి. దాన్ని ఎరగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇక సింహం నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు చిరుత నేల మీద దొర్లుతూ.. చనిపోయినట్లుగా నటిస్తుంది. అయితే పక్క నుంచి ఓ సింహం వచ్చి అకస్మాత్తుగా చిరుతపై దాడి చేస్తుంది.

సింహాల నుంచి తప్పించుకునేందుకు చిరుత దాడుల్ని మూసుకుపోయాయి. తన ప్రాణాలు రక్షించుకునేందుకు అనేక సార్లు సింహలతో చిరుత పోరాడుతుంది. ఇక చివరికి చిరుత తాను చనిపోయినట్లుగా నటిస్తూ.. సింహాలను పక్కదారి పట్టించి తప్పించుకోవాలని భావిస్తుంది. ఈ షాకింగ్ వీడియోను వరల్డ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ అండ్ విలేజ్ అనే యూట్యూబ్‌ ఛానల్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇక సింహాలు, చిరుత వేట ఆఫ్రికాలోని టాంజానియా సెరెంగేటి రిజర్వ్‌‌లో చోటు చేసుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu