Pooja Hegde: బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డ్.. నెట్టింట్లో సంబరాలు జరుపుకుంటున్న పూజా హెగ్డే..
అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది పూజా హెగ్డే. ఆ సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా
అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమా నటించి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది పూజా హెగ్డే. ఆ సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా.. వరుస ఆఫర్లను అందుకుంటూ అగ్ర కథనాయికలలో ఒకరికిగా నిలిచించింది పూజా హెగ్డే. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాతో ఈ బుట్ట బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం పూజా చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడు నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలోనూ నటించించి పూజా హెగ్డే.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ కీలక పాత్రలో నటించింది పూజా. అలాగే తమిళంలో స్టార్ హిర్ విజయ్ సరసన నటిస్తోంది. ఇలా చేతినిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న ఈ బుట్టబొమ్మ ఖాతాలో మరి రికార్డ్ వచ్చి చేరింది.
ఎప్పుడు తన వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమా విషయాలను షేర్ చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది బుట్టబొమ్మ.. అలాగే లైవ్ చాటింగ్స్ ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వారికి ఎప్పుడూ టచ్‌లో ఉంటూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకుంది. తన హెయిర్ స్టైలిస్ట్, మెకప్ ఆర్టిస్ట్, కుక్, అసిస్టెంట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్స్‌తో కలిసి ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంది. అంతేకాకుండా.. తను ఈ మైలురాయికి చేరుకున్నందుకు సహాయం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్స్ ఫాలోవర్లను సంపాదించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు నాతో ఉన్న నా క్రేజీ టీంను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వీళ్లు నన్ను నవ్విస్తారు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నన్ను అనారోగ్యం భారీన పడకుండా చూసుకుంటారు. నేను అందంగా కనిపించేలా చూసుకుంటారు. అలాగే నాకు ఇంటి ఆహారం తక్కువగా ఉండి.. వార్డ్ బోర్డ్ పనిచేయకపోయిన తగ్గిపోతుంది. ఇందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఒకేసారి నా సినిమాలను చూడవచ్చు. ఇదే పూజా హెగ్డే టీం. మీకు ధన్యావాదలు అంటూ చెప్పుకొచ్చింది పూజాహెగ్డే.
పూజా హెగ్డే ఇన్‌స్టా పోస్ట్..
View this post on Instagram
Also Read: Karthika Deepam: రేపు కార్తీక్‌కు నాకు పెళ్లి రెచ్చిపోతున్న మోనిత.. టెన్షన్‌లో డాక్టర్ బాబు!
Seetimaar Trailer Review: యాక్షన్ ఓరియెంటెడ్‌గా సీటీమార్ ట్రైలర్.. అదరగొట్టిన గోపీచంద్..