Seetimaar Trailer Review: యాక్షన్ ఓరియెంటెడ్‏గా సీటీమార్ ట్రైలర్.. అదరగొట్టిన గోపీచంద్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 01, 2021 | 7:05 AM

టాలెంటెడ్ హీరో గోపీచంద్.. మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తోన్న చిత్రం సీటిమార్. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం

Seetimaar Trailer Review: యాక్షన్ ఓరియెంటెడ్‏గా సీటీమార్ ట్రైలర్.. అదరగొట్టిన గోపీచంద్..
Gopichand
Follow us

టాలెంటెడ్ హీరో గోపీచంద్.. మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తోన్న చిత్రం సీటిమార్. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో గోపిచంద్ నటించగా.. తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుకుంటుంది. వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‏ను రామ్ పోతినేని విడుదల చేస్తూ మూవీ టీంకు విషెస్ చెప్పారు.

ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా ఫెంటాస్టిక్‏గా ఉన్నారని.. ఇది కచ్చితంగా బిగ్ స్క్రీన్ ఎక్స్‏పీరియన్స్ ఇచ్చే సినిమా అంటూ రామ్ ట్వీట్ చేశారు. ఇక విడుదలైన స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తీర్చిదిద్దినట్లుగా తెలుస్తోంది. రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు.. అదే రూట్ లెవల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్ లో వస్తారు అంటూ గోపీచంద్ డైలగ్ చెప్పడంతో ట్రైలర్ స్టా్ర్ట్ అయ్యింది. అమ్మాయిలు వేసుకునే బట్టలను బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసే మనుషులకు ఎదురుతిరిగి వాళ్లని కబడ్డీ ప్లేయర్‏గా ఎలా మారారు.. జాతీయ స్థాయిలో ఎలా గుర్తింపు తెచ్చుకున్నారనేది సీటీమార్ సినిమా. ఇక ఎప్పటిలాగే… ఈ సినిమా కూడా పూర్తి యాక్షన్ సీన్స్ ఉండేలా తెలుస్తోంది.

ఈ సినిమాలో భూమిక చావ్లా, దిగంగనా సూర్యవంశీ, రెహమాన్, రావు రమేష్, తరుణ్ అరోరా, పోసాని కృష్ణ మురళి, ప్రీతి ఆశ్రని, జబర్దస్త్ మహేష్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Hrithik Zomato Ad: హృతిక్ , కత్రినా యాడ్‌పై విమర్శలు.. రంగంలో దిగిన యాజమాన్యం.. ప్రతి కస్టమర్ హీరో అంటూ వివరణ..

Gautham Ghattamaneni Photos:తగ్గేదే..లే అందం,ఫాలోయింగ్‌లో తాతకు, తండ్రికి పోటీ.. ఘట్టమనేని వారసుడి పుట్టినరోజు స్పెషల్ ఫొటోస్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu